యాప్నగరం

మహమూబ్‌నగర్ సీరియల్ కిల్లర్‌: కల్లు కాంపౌండ్‌లో కడియాలతో కనిపిస్తే ఖతమే..!

సీరియల్ కిల్లర్ ఎరుకలి శ్రీను వరుస హత్యల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కల్లు కాంపౌండ్‌కు కాళ్లకు కడియాలు, మెట్టెలతో వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ చేసేవాడని వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 28 Dec 2019, 6:38 pm
మహమూబ్‌నగర్ సీరియల్ కిల్లర్ ఎరుకలి శ్రీను (42) మృత్యు వేటలో మరొక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎరుకలి శ్రీను కల్లు కాంపౌండ్‌కు కాళ్లకు కడియాలు, మెట్టెలతో వచ్చే మహిళలపై కన్నేస్తాడు. ఏమీ తెలియని అమాయకుడిలా వారిని మాటల్లో దించుతాడు. తాను కల్లు తాగుతూ వారిని కూడా తాగాలని ఆఫర్‌ చేస్తాడు. చివరకు మాయమాటలతో వారిని బుట్టలో వేసుకుని తన బైక్‌పై ఎక్కించుకుని పట్టణ శివారుకు తీసుకెళ్తాడు. అక్కడ మహిళలను పీకలదాకా తాగించి ఆ మత్తులోనే వారిపై అత్యాచారం చేసి, దారుణంగా హతమార్చి ఒంటిపై ఉన్న నగలన్నీ దోచుకుంటాడు.
Samayam Telugu woman


Also Read: మహబూబ్‌నగర్: మద్యం తాగే మహిళలే టార్గెట్.. 16 మందిని హత్యచేసిన సీరియల్ కిల్లర్


ఇలా ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా నలుగురు మహిళలను దారుణంగా చంపేశాడు. దేవరకద్ర మండలం నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) అనే మహిళ హత్య కేసులో శ్రీను పాత్రను నిర్ధారించేందుకు నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వరుస హత్యల వ్యవహారం బయటపడింది.

మహబూబ్‌నగర్‌ శివశక్తినగర్‌లో ఉండే ఎరుకలి శ్రీను కూలి పనిచేస్తుంటాడు. కల్లు కాంపౌండ్‌ల వద్ద కాళ్లకు కడియాలు, నగలతో కనిపించే మహిళలను ఎంచుకుంటాడు. వారిని మాయమాటలతో మభ్యపెట్టి, కల్లు తాగించి.. రేప్ చేసి హత్య చేస్తాడు. తర్వాత నగలు తీసుకుని పరారవుతాడు. భూత్పూర్‌ పరిధిలో ఆగస్టులో అంకె బాలమ్మ అనే మహిళను కూడా శ్రీను ఇదే తరహాలో హత్య చేశాడు. వీటితో పాటు కొత్తకోట, మిడ్జిల్‌ మండల శివారుల్లో ఇద్దరు మహిళలను తీసుకెళ్లి హత్య చేసినట్లు తేలింది. దోచిన నగలను శ్రీను తన భార్య సాలమ్మకు ఇస్తే.. ఆమె వాటిని అమ్మి సొమ్ముచేసుకునేది. ఈ వ్యవహారంలో సాలమ్మను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read: హత్యాచారం కేసులో నిందితుడికి ఉరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.