యాప్నగరం

మాస్క్ ధరించమన్నందుకు హోటల్ ఓనర్ అరాచకం.. కొట్టి రోడ్డుపై పడేసి..

లాక్‌డౌన్ అతిక్రమించి గుట్టుగా హోటల్ నడుపుతున్న రాజ్‌బీర్.. మాస్క్ పెట్టుకోమన్నందుకు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. భార్యని చితకబాది ఇంటి నుంచి గెంటేశాడు.

Samayam Telugu 12 Apr 2020, 9:08 pm
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి నిషేధాజ్ఞ‌లు అమలు చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. యథేచ్ఛగా తమ పనులు తాము గుట్టుగా చేసుకుపోతున్నారు. తాము ఇబ్బందులను కొనితెచ్చుకోవడమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలోని నెడుతున్నారు. అలాంటి సంఘటనే తాజాగా గురుగ్రామ్‌లో వెలుగుచూసింది.
Samayam Telugu herrass


మాస్క్ ధరించమని.. దుకాణం మూసివేయమని చెప్పినందుకు ఓ హోటల్ యజమాని కట్టుకున్న భార్యనే చితకబాది రోడ్డున పడేసిన ఘటన జమల్‌పూర్‌ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌లో జరిగింది. అదే ప్రాంతానికి చెందిన రాజ్‌బీర్ అనే వ్యక్తి హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా రాజ్‌బీర్ గుట్టుగా తన దుకాణం తెరిచి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు.

Also Read: డ్రోన్‌లో పాన్.. ఏకంగా హోమ్ డెలివరీ.!

కనీసం మాస్క్ కూడా ధరించకుండా వెళ్తుండడంతో అతని భార్య అడ్డుచెప్పింది. ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని కోరింది. అయినా వినకుండా ఉదయం హోటల్ తెరిచేందుకు వెళ్తున్న భర్తని కనీసం మాస్క్ అయినా ధరించాలని వేడుకుంది. దీంతో కోపం వచ్చిన భర్త ఆమెను దుర్భాషలాడుతూ ఇంటి నుంచి హోటల్‌కు వెళ్లిపోయాడు.

టికి తిరిగొచ్చిన తర్వాత అదే విషయమై భార్యాభర్తల నడుమ వివాదం రేగడంతో రాజ్‌బీర్ భార్యను బండబూతులు తిడుతూ తీవ్రంగా కొట్టాడు. తన తల్లితో కలసి బెల్టుతో చావబాది ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. తీవ్రగాయాలపాలైన భార్య మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. రాజ్‌బీర్ హోటల్ ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తేలిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

Read Also: అన్నీ ఉన్నా.! వృద్ధాప్యంలో ఓ తండ్రి వ్యధ.. కంటతడి పెట్టిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.