యాప్నగరం

క్వారంటైన్‌ కేంద్రంలో కామక్రీడలు.. నిద్రపోతున్న యువతిపై అఘాయిత్యం

మహిళలు ఉన్న క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించిన శంకర్ బాత్రూమ్ వద్ద ఓ మహిళలపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె తప్పించుకుని పారిపోగా మరో యువతిపై అత్యాచారానికి యత్నించాడు.

Samayam Telugu 21 Jun 2020, 1:25 pm
కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ కేంద్రాలు అక్రమాలకు, అఘాయిత్యాలకు అడ్డాగా మారుతున్నాయి. ఆయా కేంద్రాల్లో ఉంటున్న మహిళలపై కొందరు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ క్వారంటైన్ కేంద్రంలో మహిళలపై లైంగిక దాడికి యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Samayam Telugu Image


Also Read: హిజ్రాతో పీకల్లోతు ప్రేమ.. నెలరోజులు సహజీవనం.. చివరికి ఇద్దరూ కలిసి

బెంగళూరులోని ఓ క్వారంటైన్ కేంద్రంలోనే చాలామంది మహిళలు కొద్దిరోజులుగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి శంకర్ అనే స్థానిక యువకుడు మద్యం తాగి అక్కడికి చొరబడ్డాడు. బాత్‌రూమ్‌ వద్ద ఓ మహిళలపై లైంగిక దాడికి యత్నించగా ఆమె తప్పించుకుంది. అదే సమయంలో ఓ గదిలోకి దూరి నిద్రపోతున్న యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అక్కడే ఉన్న మహిళలు గట్టిగా కేకలు వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకుని నిర్భందించారు.

Also Read: కృష్ణా జిల్లాలో యువకుడి దారుణహత్య.. అర్ధరాత్రి సైకిల్‌పై వెళ్తుండగా దారికాచి

అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని వారికి అప్పగించారు. శంకర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. గదిలో అతడి చేతిలో లైంగిక వేధింపులకు గురైన యువతి స్వస్థలం ముంబయిగా పోలీసులు గుర్తించారు. ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉంటోంది. ఈ ఘటనతో క్వారంటైన్ కేంద్రాల్లో మహిళల భద్రత మరోసారి చర్చనీయాంశమైంది.

Also Read: హైదరాబాద్‌లో వృద్ధురాలి దారుణహత్య.. నగలతో ఉడాయించిన పనిమనిషి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.