యాప్నగరం

భార్యను వివస్త్రను చేసి ఇనుప కడ్డీలతో ఒళ్లంతా వాతలు.. వనపర్తిలో భర్త కిరాతకం

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం ఆమెను వివస్త్రను చేసి ఇనుప కడ్డీలతో వాతలు పెట్టాడు. ఆమె గాయాలు చూసి పోలీసులే చలించిపోయారు.

Samayam Telugu 27 Feb 2020, 3:31 pm
కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి నిత్యం చిత్రహింసలు పెడుతున్న ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వెలుగుచూసింది. వనపర్తి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు ఉపాధి కోసం కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త వేధించడం మొదలుపెట్టాడు. రెండ్రోజుల క్రితం జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన భర్త ఇనుప రాడ్‌తో తల పగులగొట్టాడు.
Samayam Telugu pjimage


Also Read: నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సమీపంలో ఘోరం.. మైనర్ బాలికను ఎత్తుకెళ్లి రేప్

ఆవేశం చల్లారక ఆమెను వివస్త్రను చేసి శరీరంపై ఇనుప చువ్వలతో వాతలు పెడుతూ ఆ దృశ్యాలను 14ఏళ్ల కొడుకుతో సెల్‌ఫోన్లో వీడియో తీయించాడు. ఆ దుర్మార్గుడి చిత్రహింసలు తట్టుకోలేక ఇంటి నుంచి తప్పించుకున్న బాధితురాలు వనపర్తి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇంటిపై గాయాలు చూసి చలించిపోయిన పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: సీఎం జగన్‌పై టిక్‌టాక్ వీడియో.. సొంత జిల్లా వ్యక్తిపై కేసు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెల్‌ఫోన్లో చిత్రీకరించిన వీడియో చూసి షాకయ్యారు. భర్త ఆమెను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశాడని, ఈ వీడియో చూస్తే ఎవరైనా చలించక మానరని వనపర్తి ఎస్ఐ వెంకటేశ్వర్‌ గౌడ్‌ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్తను అదుపులోకి తీసకుని విచారిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ రిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేసినట్లు వనపర్తి పోలీసులు తెలిపారు.

Also Read: భర్త ఆఫీసుకి వెళ్లగానే ప్రియుడితో బెడ్రూమ్‌లో రొమాన్స్, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేయడంతో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.