యాప్నగరం

భర్త చాటింగ్ లిస్ట్ చూసి భార్యకి షాక్.. ఆ అమ్మాయెవరని అడగడంతో..!

మీ ఫోన్‌కి మెసేజ్ చేసిన ఆ అమ్మాయి ఎవరంటూ వైశాలి తన భర్తను నిలదీసింది. అందుకు అతను సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరికి..

Samayam Telugu 11 Sep 2020, 6:39 pm
పొద్దున్నే మోగిన మెసేజ్ టోన్‌తో మెలకువ వచ్చిన భార్య తన భర్త ఫోన్ తీసి చూసి షాక్‌కి గురైంది. చాటింగ్ లిస్ట్‌లో మరో అమ్మాయి పేరు. మెసేజ్‌లు చదవడం మొదలుపెట్టింది. వాటితో పాటు ఆడియా ఫైల్స్. అన్నింటినీ వింటుండగా సడెన్‌గా భర్త లేచాడు. ఎవరా అమ్మాయి అని అడగడంతో యుద్ధం మొదలైంది. సమాధానం చెప్పలేని భర్త చేయి చేసుకోవడంతో చివరికి పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Affair


సబర్మతి పరిధిలోని డీ క్యాబిన్‌ ఏరియాకి చెందిన ప్రితేష్ పటేల్, వైశాలి పటేల్(30) భార్యాభర్తలు. పదేళ్ల కిందట పెళ్లైన భార్యాభర్తలకి ఏడేళ్ల కూతురు ఉంది. ఓ రోజు ఉదయాన్నే భర్త ఫోన్‌కి మెసేజ్ రావడంతో మెలకువ వచ్చిన వైశాలి భర్త ఫోన్ తీసుకుని చూసింది. నీలమ్ సోని అనే మహిళ మెసేజ్ చేయడంతో అనుమానం వచ్చి భర్త చాట్ లిస్ట్ అంతా చెక్ చేసింది. అంతలో ఆడియో ఫైల్స్ కూడా కనిపించాయి. అవి వింటుండగా భర్త నిద్రలేచాడు.

Also Read: సెక్స్ వర్కర్లకి కరోనా పాజిటివ్.. మరి వారిని కలిసిన విటులెవరో.!

ఎవరా నీలమ్ సోని అని భార్య నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది చినికిచినికి గాలివానగా మారడంతో ప్రితేష్ ఆగ్రహంతో భార్యని చావబాదాడు. ఆ అమ్మాయెవరని అడినందుకు భర్త దాడి చేసి కొట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. భర్త దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

Read Also: కారు ఆగిపోయి కామాంధుల కంటపడిన మహిళ.. కన్నబిడ్డల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.