యాప్నగరం

కూతురికి, అల్లుడికి గొడవ.. అత్త వేలుపెట్టడంతో ఊహించని దారుణం

పెళ్లయిన కొద్దిరోజుల నుంచే పవన్, సవిత దంపతుల మధ్య విభేదాలు పొడచూపాయి. ఏదో విషయమై ఇద్దరూ నిత్యం గొడవపడేవారు. అప్పటి వరకూ బాగానే ఉన్నా కూతురికి అత్త వంతపాడడంతో అల్లుడు తట్టుకోలేకపోయాడు.. చివరికి..

Samayam Telugu 23 Aug 2020, 5:42 pm
భార్యాభర్తల మధ్య గొడవలో జోక్యం చేసుకుంటే పరిణామాలు అంత దారుణంగా మారిపోతాయని పాపం ఆ అత్త ఊహించలేకపోయింది. కూతురితో గొడవపడుతున్నాడని అత్త తలదూర్చింది. చివరికి అదే ఆ తల్లీకూతుళ్లకి ఆఖరి రాత్రి అయింది. భార్యతో గొడవ పక్కనబెడితే అత్త జోక్యం సహించలేకపోయిన అల్లుడు ఆగ్రహంతో ఇద్దరినీ కిరాతకంగా చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
assault


కన్నౌజ్ జిల్లా హౌదాపూర్వ గ్రామానికి చెందిన పవన్‌కి అదే ప్రాంతానికి చెందిన సవితతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. ఇద్దరూ నిత్యం ఏదో విషయమై గొడవపడేవారు. భార్యాభర్తల మధ్య ఘర్షణ సాధారణమైపోయింది. రెండు రోజుల కిందట ఇద్దరి మధ్య మరోమారు పెద్దదుమారం రేగింది. అయితే కూతురితో అస్తమానం గొడవపడుతున్న అల్లుడి వైఖరి చూసి భార్యాభర్తల గొడవలో అత్త కళావతి(65) తలదూర్చింది. కూతురికి వంతపాడింది. అదే ఆమెకి కాళరాత్రిని మిగిల్చింది.

Also Read: ఇంటి ఓనర్ భార్యపై రేప్.. ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి..

అత్త జోక్యాన్ని సహించలేకపోయిన అల్లుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. అర్ధరాత్రి వేళ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తల్లీకూతుళ్లని కొడవలితో దారుణంగా నరికి చంపేశాడు. కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. శవాలను ఇంటి వెనక పెరట్లో పడేసి మరుసటి రోజు ఉదయాన్నే నేరుగా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. తన భార్య, అత్తని చంపేశానని.. శవాలను ఇంటి వెనక పడేశానని చెప్పి ఆయుధంతో సహా పోలీసుల ఎదుట నిల్చున్నాడు. స్పందించిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:
తల్లీకూతుళ్ల రహస్య శృంగారం.. ఒకే ప్రియుడితో.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.