యాప్నగరం

కూతురి ముచ్చట తీర్చలేక.. తనువు చాలించిన తండ్రి.. తిరుపతిలో విషాద ఘటన

కరోనా వైరస్ కాపురాల్లోనూ చిచ్చుపెడుతోంది. కూతురి ఫంక్షన్ చేయాలన్న భార్య కోరిక నెరవేర్చలేక.. కూతురి ముచ్చట తీర్చలేక ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 10 Jul 2020, 2:22 pm
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్ వంటి కఠిన చర్యలు చేపట్టడంతో చిన్నాచితకా జీవితాలు రోడ్డునపడ్డాయి. చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అలాంటి దారుణ పరిస్థితుల్లో కూతురి ఫంక్షన్ చేయాల్సి రావడంతో ఓ తండ్రి కుంగిపోయాడు. కూతురి ముచ్చట తీర్చలేకపోతున్నానన్న బాధతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


తిరుపతి పరిధిలోని తుమ్మలగుంటకి చెందిన ఆటో డ్రైవర్ చంద్రయ్య(47) లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నాడు. అదే సమయంలో కూతురి ఓణీల ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. కూతురి ఫంక్షన్ జరిపించాలని భార్య రేఖ అడిగింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా సంపాదన పూర్తిగా తగ్గిపోయిందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఫంక్షన్ చేయలేనని చెప్పాడు. ఈ విషయమై భార్యాభర్తల నడుమ స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: గోదారిలో దూకి దంపతుల ఆత్మహత్య.. బాసరలో విషాదం

కన్నకూతురి ఓణీల ఫంక్షన్ కూడా చేయలేకపోతున్నానని మనస్థాపానికి గురైన చంద్రయ్య అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉదయాన్నే తుమ్మలగుంట శ్మశానవాటికలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. ఉరికి వేలాడుతున్న చంద్రయ్యని గమనించిన స్థానికులు వెంటనే అతని కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం రుయాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: భార్యతో ఫ్రెండ్ ఎఫైర్.! అనుమానంతో భర్త ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.