యాప్నగరం

ముగ్గురితో భార్య అఫైర్, భర్తకు నిత్యం వేధింపులు.. తట్టుకోలేక అతడేం చేశాడంటే..

అక్రమ సంబంధాలు పచ్చటి కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. తాత్కాలిక సుఖం కోసం జీవిత భాగస్వాములను చంపేందుకు సైతం కొందరు వెనుకాడటం లేదు. కొందరైతే పిల్లలను సైతం పొట్టన పెట్టుకుంటున్నారు. వివాహ బంధం కంటే అక్రమ సంబంధమే ముఖ్యమని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజగా అక్రమ సంబంధానికి మరో ప్రాణం బలైపోయింది. వివాహ కట్టుబాట్లను కాలరాస్తూ ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రియుళ్లతో కలిసి భర్తను చిత్రహింసలు పెట్టింది. వారి వేధింపులు తాళలేని ఆ అమాయకుడు మనస్తాపానికి గురై కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌కోట్‌లోని గాంధీరామ్ అనే ప్రాంతంలో ప్రహ్లాద్, ధన్‌భాయి మహేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. కూలి పనులు చేసే ప్రహ్లాద్.. రోజూ ఉదయం వెళ్తే రాత్రికే ఇంటికి వచ్చేవాడు. దీంతో రోజంతా ఒంటరిగా ఉండే మహేశ్వరి అదే ప్రాంతానికి చెందిన నర్సింహ, రవిశంకర్, మహేశ్‌ అనే ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

Samayam Telugu 1 Apr 2020, 12:04 pm

Samayam Telugu man commits suicide in rajasthan over wife illegal affair
ముగ్గురితో భార్య అఫైర్, భర్తకు నిత్యం వేధింపులు.. తట్టుకోలేక అతడేం చేశాడంటే..

ముగ్గురు వ్యక్తులతో భార్య అఫైర్

ముగ్గురు ప్రియుళ్లను రోజూ ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న ప్రహ్లాద్ పద్దతి మార్చుకోవాలని భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. దీంతో ఈ విషయాన్ని ఆమె తన ప్రియుళ్లకు చెప్పింది. ఆ ముగ్గురు కలిసి అతడిని నిత్యం వేధించడం ప్రారంభించారు. నువ్వు చేతగాని వాడివి కాబట్టే నీ భార్య మాతో అఫైర్ పెట్టుకుందని సూటిపోటి మాటలు అనేవారు. ఓ వైపు భార్య తన మాట వినకపోవడం, మరోవైపు ఆ ముగ్గురి వేధింపులతో ప్రహ్లాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Also Read: ఆమెను చంపింది ప్రియుడే.. అక్రమ సంబంధమే కొంపముంచింది

పరువు పోయిందన్న మనస్తాపంతో..

గ్రామంలో పరువు పోయాక బ్రతకడం అనవసరమని భావించి ఇంట్లోనే కరెంట్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్లహ్లాద్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో మహేశ్వరి అక్రమ సంబంధాల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో పోలీసులు మృతుడి భార్యతో పాటు ఆమె ముగ్గురు ప్రియుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

​భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం..

భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే చంపేసిన ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో వెలుగుచూసింది. తిరుకూర్ణం ప్రాంతానికి చెందిన మణికంఠన్ (27) తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య గాయత్రీదేవి, ఓ కుమారుడున్నారు. ఉపాధి నిమిత్తం మణికంఠన్ నెలలో కొద్దిరోజులు వేరే ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే గాయత్రికి భర్త స్నేహితుడైన కమల్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన మణికంఠన్ ఆరా తీయగా అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో గాయత్రి ప్రియుడితో కలిసి భర్తకు మద్యం తాగించి రాళ్లతో కొట్టి చంపేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు రావడంతో గాయత్రి, కమల్ కటకటాల పాలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.