యాప్నగరం

కరోనా వచ్చిందంటూ హేళన.. వ్యక్తి ఆత్మహత్య.. అనంతపురంలో విషాదం

కరోనా సోకిన వ్యక్తిని తెలియక పలకరించడమే నేరమైంది. అతనికి కూడా కరోనా వచ్చిందంటూ చుట్టూ ఉన్నవాళ్లు సూటిపోటి మాటలనడంతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు నాగన్న.

Samayam Telugu 26 Jul 2020, 5:17 pm
కరోనా రోగిపై వివక్ష చూపొద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా కొందరిలో ఇంకా అపోహలు వీడడం లేదు. కరోనా రోగితోనే కాదు.. రోగితో మాట్లాడిన వారిని.. వారికి సన్నిహితంగా ఉన్న వారిని చూసినా భయంతో వణికిపోతున్నారు. రోగితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ వైరస్ బాధితులుగానే చూస్తూ వెలివేస్తున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి అమానుష ఘటన ఒకటి అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


కరోనా సోకిన వ్యక్తితో మాట్లాడాడన్న కారణంగా గ్రామస్తులు దూరం పెట్టడంతో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బ్రహ్మసముద్రం మండలంలో చోటుచేసుకుంది. ముప్పులకుంట గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా సోకి ఐదు రోజుల కిందట మృత్యువాతపడ్డాడు. అతను చనిపోక ముందు అదే గ్రామానికి చెందిన చాకలి నాగన్న కరోనా బాధితుడిని పలకరించాడు. తీరా బాధితుడు కరోనాకి బలవ్వడంతో గ్రామస్తులు నాగన్నను కూడా దూరం పెట్టారు.

Also Read: లేడీస్ హాస్టల్స్‌లో దూరి.. అమ్మాయిల లోదుస్తులతో వికృత చేష్టలు

అంతటితో ఆగని స్థానికులు.. నీకు కూడా కరోనా వచ్చిందంటూ నాగన్నని హేళన చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నాగన్న కళ్యాణదుర్గం రోడ్డులోని అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న నాగన్నని చూసిన పశువుల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు 108కి సమాచారం అందించడంతో సిబ్బంది కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అనంతపురం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:
గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆమె ఇంటి చుట్టూ చక్కర్లు.. విషయం వాళ్ల నాన్నకి తెలియడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.