యాప్నగరం

హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం.. లారీ చక్రాల కింద నలిగి వ్యక్తి దుర్మరణం

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జంక్షన్ వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లారీ చక్రాలు అతడి మీద నుంచి వెళ్లడంతో రక్తస్రావంతో చనిపోయాడు.

Samayam Telugu 18 May 2020, 7:45 pm
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 50 రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పటిష్టంగా అమలు చేయడంతో నేరాలు, రోడ్డుప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పడ్డాయి. అయితే ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడంతో ప్రజలు వాహనాలతో బయటకు వస్తున్నారు. దీంతో రోడ్డుప్రమాదాల సంఖ్య పెరిగింది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతమైన ఖైరతాబాద్‌లో ఓ వ్యక్తి లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu ప్రమాద దృశ్యం


Also Read: ప్రియుడితో భార్య సహజీవనం, పగతో రగిలిపోయిన భర్త.. హత్యతో బంధానికి చెక్

సోమవారం సాయంత్రం ఖైరతాబాద్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ భారీ లారీ బీభత్సం సృష్టించింది. ముందు స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. అదుపుతప్పిన అతడు వెనుక చక్రాల కింద పడి నలిగిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కారణంగా ఖైరతాబాద్‌‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Also Read: కామ కోరికలతో రెచ్చిపోయిన 13ఏళ్ల బాలుడు.. ఐదేళ్ల చిన్నారిని దారుణంగా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.