యాప్నగరం

కూతురిని చంపి పాతిపెట్టి.. ప్రియుడిని ఇరికించే కుట్ర.. ఖాకీల ఎంట్రీతో షాక్

కాలేజీకి వెళ్తున్న కూతురు అన్యమతస్తుడిని ప్రేమించింది. ఆ విషయం అందరికీ తెలిసిపోవడంతో పంచాయితీ దాకా వెళ్లింది. పరువు పోయిందంటూ రగిలిపోయిన తండ్రి..

Samayam Telugu 18 Oct 2020, 10:20 am
దేశంలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుళ్లను మట్టుబెట్టేందుకు కూడా ఉన్మాదులు వెనకాడడం లేదు. తాజాగా కర్ణాటకలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పరాయి మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని కన్నకూతురిని చంపేశాడో కసాయి తండ్రి. ఆ నేరాన్ని ఆమె ప్రియుడిపైకి తోసేసేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ నెల 11న తోటలో పూడ్చిపెట్టిన యువతి శవాన్ని వెలికితీసిన కేసును పోలీసులు ఛేదించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


మాగడి తాలూకా బెట్టహళ్లి గ్రామానికి చెందిన హేమలత(18) సమీప పట్టణంలోని కళాశాలలో డిగ్రీ చదువుతోంది. పరాయి మతానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో పెద్దలు పంచాయితీ పెట్టి మందలించారు. కూతురు అన్యమతస్తుడిని ప్రేమించడం.. పంచాయితీ పెట్టాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె తండ్రి క్రిష్ణప్ప(48) కోపంతో రగిలిపోయాడు.

Also Read: పెళ్లైనా వదలని కీచకుడు.. భర్త లేని సమయంలో ఇంటికెళ్లి దారుణం.. చివరికి..

కూతురిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన అన్న కొడుకు చేతన్(20) మరో మైనర్‌తో కలసి కూతురి హత్యకు పథకం రచించాడు. హేమలతను కిరాతకంగా హత్య చేసి తోటలో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టేశారు. నేరాన్ని ఆమె ప్రియుడిపై నెట్టేసేందుకు యత్నించాడు. తన కూతురిని ఆమె ప్రియుడే హత్య చేశాడంటూ వదంతులు పుట్టించాడు. తీరా పోలీసులు రంగంలోకి దిగడంతో కథ అడ్డం తిరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Read Also:
ప్రియురాలి కోసం భర్త ఘాతుకం.. ప్రకాశంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.