యాప్నగరం

మహబూబాబాద్‌: పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు స్నేహితుడి హత్య

తన పక్కింటి వ్యక్తితో స్థల వివాదం కొనసాగుతున్నందున అతడిని భయపెట్టేందుకు తనకు పరిచయమున్న వెంకన్న అనే వ్యక్తిని హరీష్ దారుణంగా చంపేసి మొండాన్ని అతడి స్థలంలో వేశాడు.

Samayam Telugu 25 Aug 2020, 7:06 am
ఓ వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేసేందుకు చేసిన ప్రయత్నం అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్థల వివాదం నేపథ్యంలో పొరుగింటి వ్యక్తిని భయపెట్టేందుకు అభంశుభం తెలియని తన స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన వెంకన్న(46).. పది సంవత్సరాల క్రితం కేసముద్రం మండలం వచ్చి కాగితాలు, అట్టలు ఏరుకుని విక్రయిస్తూ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇదే మండలంలోని గిర్నితండాకు చెందిన ఆంగోతు హరీష్‌కు వెంకన్నతో పరిచయం ఉంది.
Samayam Telugu Image


Also Read: ప్రియుడితో యువతి శృంగారం.... వీడియో తీసి చుక్కలు చూపించిన కామాంధులు

కొంతకాలంగా హరీష్‌కు తన ఇంటి పక్కన ఉన్న కర్పూరపు గోపాల్‌తో ఇంటి స్థల విషయమై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గోపాల్‌ను ఎలాగైనా భయపెట్టి స్థలాన్ని కాజేయాలని హరీష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎవరూలేని వెంకన్నను చంపేసి గోపాల్‌ను భయపెట్టాలని ప్లాన్ వేశాడు. ఆదివారం రాత్రి వెంకన్నను తన ఇంటికి పిలిచి ఇద్దరూ మద్యం సేవించారు. తర్వాత హరీష్‌ పారతో వెంకన్న మెడపై నరికి చంపేశాడు.

Also Read: శ్రీకాకుళం: ‘ఇంటికొచ్చి కోరిక తీరిస్తే కేసు నుంచి తప్పిస్తా’.. మహిళకు ఎస్ఐ వేధింపులు

ఆ తర్వాత తలను శరీరం నుంచి వేరు చేశాడు. మొండాన్ని గోపాల్ ఇంటి స్థలంలోను, తలను సంచిలో పెట్టుకుని మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ సమీపంలోని ఓ ఇంటి పక్కన పడేశాడు. సోమవారం ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. ఈ ఘటన వివరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియాకు వివరించారు.

Also Read: ప్రియురాలితో వెళ్లిపోయిన భర్త.. బిడ్డతో సహా మహిళ ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.