యాప్నగరం

భార్యని తీసుకెళ్లిపోయిన ప్రియుడు.. పదేళ్ల తర్వాత భర్త కంటపడడంతో.. దారుణం

మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ప్రియుడితో వెళ్లిపోయింది. ఆ కోపం తగ్గని భర్త పదేళ్ల తర్వాత కనిపించిన ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు.

Samayam Telugu 10 Oct 2020, 4:40 pm
వివాహేతర సంబంధం పెట్టుకుని మరొకరి భార్యను ఊరి నుంచి తీసుకెళ్లిపోయిన వ్యక్తి పదేళ్ల తర్వాత కనిపించడంతో ఘోరం జరిగిపోయింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న భర్త కిరాతకంగా రాయితో కొట్టి చంపేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌కి చెందిన మల్లేష్, భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉండేవారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


ఈ క్రమంలో మల్లేష్ భార్య అదే గ్రామానికి చెందిన శ్రీహరి(43)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించారు. తీరా తమ అక్రమ సంబంధం బయటపడుతుందేమోనన్న అనుమానంతో పదేళ్ల కిందట ఇద్దరూ ఊరు వదిలి వెళ్లిపోయారు. ప్రియుడితో కలసి ఆమె గోవా వెళ్లిపోయింది. అనంతరం మల్లేష్ మరో వివాహం చేసుకున్నాడు.

Also Read: తాళి కట్టి హోటల్‌కి.. భార్య స్నానానికి వెళ్లగానే భర్త.. కర్నూలులో షాకింగ్ ఘటన

అయితే పది రోజుల కిందట గ్రామానికి వచ్చిన శ్రీహరి.. తన ప్రియురాలి భర్త మల్లేష్ కంటపడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన మల్లేష్ బలంగా శ్రీహరిని వెనక్కి తోసేయడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. అంతటితో ఆగని మల్లేష్ క్షణికావేశంలో పక్కనే ఉన్న పెద్ద బండరాయి తీసుకుని తలపై శ్రీహరి అమాంతం పడేశాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మల్లేష్ స్వయంగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also: ఫ్రెండ్ ఫోన్‌తో ప్రియురాలితో ముచ్చట్లు.. చివరికదే కొంపముంచింది.! గుంటూరులో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.