యాప్నగరం

ఫ్రెండ్ చెల్లెలితో లవ్ ఎఫైర్.. స్నేహితుడికి తెలిసిపోవడంతో.. కృష్ణా జిల్లాలో దారుణం

ఫ్రెండ్‌షిప్ పేరుతో దగ్గరైన యువకుడు తన ఫ్రెండ్ చెల్లెలిలో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. అది ఫ్రెండ్‌కి తెలిసిపోవడంతో పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో అతనిని అంతమొందించేశాడు.

Samayam Telugu 13 May 2020, 11:55 am
ఫ్రెండ్ చెల్లెలితో ప్రేయాయణం సాగించిన యువకుడు.. విషయం తెలిసిపోవడంతో స్నేహితుడిని అడ్డు తొలగించుకునేందుకు దారుణానికి ఒడిగట్టాడు. ఫ్రెండ్‌కి విషమిచ్చి చంపేశాడు. ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. మచిలీపట్నం అమృతపురం ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి సాయి(21), అదే ప్రాంతానికి చెందిన యాసిన్ స్నేహితులు. స్నేహితుడి కోసం యాసిన్ తరచూ అతని ఇంటికి వెళ్లేవాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ క్రమంలో సాయి చెల్లెలితో పరిచయం ఏర్పరుచుకుని ప్రేమలోకి దింపాడు. ఫ్రెండ్‌ని మోసం చేసి చెల్లెలితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఆ విషయం సాయికి తెలిసిపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. తన చెల్లెలి వెంట పడొద్దని.. పద్ధతి మార్చుకోవాలని సాయి పలుమార్లు యాసిన్‌ని హెచ్చరించాడు. తరచూ ఇద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నాయి.

Also Read: పెళ్లాం పక్కింటికెళ్లిందని దారుణం.. గొంతుపిసికి చంపేసిన మొగుడు

తన ప్రియురాలితో మాట్లాడేందుకు సాయి అడ్డు వస్తున్నాడని కక్ష పెంచుకున్న యాసిన్ స్నేహితుడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మద్యం తాగుదామని నమ్మించి సాయిని ఆహ్వానించాడు. ఇద్దరూ కలసి మద్యం తాగుతున్న సమయంలో సాయి గ్లాసులో సైనెడ్ కలిపి ఇచ్చాడు. అది గమనించని సాయి సైనెడ్ కలిపిన మద్యం తాగేశాడు.

సైనెడ్ తాగి స్నేహితుడు గిలగిలా కొట్టుకుంటుండగా యాసిన్ అక్కడి నుంచి పరారయ్యాడు. కొనఊపిరితో కొట్టుకుంటున్న సాయిని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు.

Read Also: కరోనా మృతురాలి ముక్కుపుడక మాయం.. ఒంటిపై బంగారం ఒలిచేసిన కిలాడీలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.