యాప్నగరం

12 ఏళ్ల బాలికకు పోర్న్ వీడియో చూపించిన కామాంధుడు

మైనర్ బాలికకు పోర్న్ వీడియో చూపించిన కామాంధుడికి న్యాయస్థానం షాకిచ్చింది. అతడికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Samayam Telugu 29 Dec 2019, 11:24 am
మైనర్ బాలికకు పోర్న్ వీడియో చూపించి లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధుడికి న్యాయస్థానం మూడు నెలల జైలుశిక్ష విధించింది. ముంబయి పశ్చిమ ప్రాంతంలోని అంధేరిలో ఓ వ్యక్తి న్యూస్‌పేపర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. 2015 సంవత్సరంలో ఓ రోజు తండ్రికి సాయం చేసేందుకు ఇద్దరమ్మాయిలు దుకాణానికి వెళ్లారు.
Samayam Telugu girl rape


Also Read: ‘నా కూతురిని ఏడాదిగా రేప్ చేస్తూ.. రెడ్‌లైట్ ఏరియాకు అమ్మేస్తామంటున్నారు’

కొద్దిసేపటి తర్వాత దుకాణం యజమాని ఓ పని నిమిత్తం పెద్ద కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అమర్జిత్ కుమార్ కనోజియా అనే వ్యక్తి బాలికతో మాటలు కలిపాడు. తాను కొత్తగా కొనుగోలు చేసి సెల్‌ఫోన్లో వీడియోలు చూపిస్తానంటూ పోర్న్ వీడియోలు ఆమెకు చూపించాడు. ఆ సమయంలో బాలిక జననాంగాలు తడుముతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బెదిరిపోయిన బాలిక దుకాణం నుంచి బయటకు పరుగులు తీసింది.

Also Read: యువతిని గర్భవతిని చేసిన పెదనాన్న కొడుకు.. తెలంగాణలో మరో ఘోరం

కాసేపటి తర్వాత తిరిగొచ్చిన తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం కనోజియా దోషిగా నిర్ధారించి మూడు నెలల జైలుశిక్ష విధించింది.

Also Read: బావమరిదిని చంపి బావిలో పడేసిన బావ.. మెదక్‌ జిల్లాలో దారుణహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.