యాప్నగరం

ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. చూడలేకపోయిన ప్రియుడు ఏం చేశాడంటే..

ప్రియురాలికి మరొకరితో పెళ్లి శిశ్చయమైందని తెలియడంతో ప్రియుడు భరించలేకపోయాడు. తనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో ఘాతుకానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లి దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడే తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి పనులపై వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చి చూసే సరికే కూతురు రక్తపు మడుగులో కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.

Samayam Telugu 24 Feb 2020, 8:25 pm

Samayam Telugu man slits girlfriends throat before killing self in uttar pradesh
ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. చూడలేకపోయిన ప్రియుడు ఏం చేశాడంటే..

కొన్నేళ్లుగా ప్రేమ..

కౌశంభి జిల్లా సయాద్ సరవాన్ గ్రామానికి చెందిన యువతి(23), పొరుగునే ఉన్న ఫతేపూర్ జిల్లాకు చెందిన చోట్కా అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సడెన్‌గా యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం ఖాయం చేశారు. నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికి ముందు జరిగే తిలక్ కార్యక్రమం కోసం యువతిని ఒంటరిగా ఇంట్లో ఉంచి కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వెళ్లారు.

Also Read: కొడుకును లాడ్జి గది బయట నిలబెట్టి.. ప్రియుడితో మహిళ రాసలీలలు.. భర్త వీడియో కాల్ చేయడంతో..

ప్రియురాలిని చంపేసి.. తాను కూడా..

తను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని నేరుగా ఇంటికొచ్చాడు. ప్రియురాలి గొంతుకోసి అతి కిరాతకంగా చంపేశాడు. కత్తితో గొంతుకోయడంతో ఒక్కసారిగా ఆమె సోఫాలో కుప్పకూలిపోయింది. అనంతరం అతను కూడా అదే గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటికొచ్చిన పేరెంట్స్‌కి షాక్

తిలక్ కార్యక్రమం నుంచి తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తట్టినా కూతురు ఎంతకీ తలుపు తీయకపోవడంతో కంగారుపడ్డారు. లోపల నుంచి గడియ పెట్టి ఉందని తెలుసుకుని నెమ్మదిగా ఇంటిపైకి ఎక్కి లోపలకి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి రక్తపు మడుగులో పడి ఉండడంతో సహా.. వేరే వ్యక్తి ఉరేసుకుని ఉండడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Read Also: ‘అమ్మాయి కోసం కాదు..’ కరీంనగర్‌లో ట్రైనీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. విషాదం

వాళ్లిద్దరూ ప్రేమికులే..

ప్రియురాలి పెళ్లి విషయం తెలుసుకుని ప్రియుడే ఆమెను చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని.. ఆమెకు పెళ్లి కుదరడంతో తట్టుకోలేక ప్రియుడు ఆమెను గొంతుకోసి చంపేశాడని.. అనంతరం తాను కూడా ఉరేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.