యాప్నగరం

పోలీసులకి దొరక్కుండా పారిపోతూ వ్యక్తి మృతి.. గుంటూరులో విషాదం

పోలీసులను చూసిన జాఫర్ పొలాల వైపు పరుగెత్తాడు. కానిస్టేబుల్ వెంటపడడంతో వేగంగా పరిగెత్తలేక అక్కడే కుప్పకూలి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 10 Apr 2020, 9:52 pm
లాక్‌డౌన్‌ వేళ గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి పోలీసులకు దొరక్కుండా పారిపోయే ప్రయత్నంలో కుప్పకూలి చనిపోయాడు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన షేక్ జాఫర్(55) స్నేహితులతో కలసి సరదాగా బయటికి వచ్చినల్లు తెలుస్తోంది.
Samayam Telugu police gg


లాక్‌డౌన్ నేపథ్యంలో గ్రామంలో రోడ్లపై తిరుగుతున్నారన్న సమాచారంతో అదే సమయంలో పోలీసులు రాయపూడి చేరుకున్నారు. ఒక్కసారిగా పోలీసులను చూసి గ్రామస్థులు పొలాల్లోకి పరుగులు తీశారు. బయట ఎందుకు తిరుగుతున్నారంటూ కానిస్టేబుల్ రామయ్య గ్రామస్థుల వెంటపడడంతో భయంతో పరిగెడుతూ జాఫర్ కిందపడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. జాఫర్ కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు.

Also Read: చెరుకుతోటలో గర్భిణి శవం.. బట్టలు చించేసి రేప్‌ డ్రామా.. హంతకుడిని పట్టించిన హ్యాండ్‌రైటింగ్

కానిస్టేబుల్ అత్యుత్సాహం వల్లే జాఫర్ మరణించాడని.. పరిగెత్తలేక కిందపడిపోయి చనిపోయాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న తుళ్లూరు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాఫర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: మైనర్ బాలికపై పదేపదే అత్యాచారం.. గర్భం వచ్చిందని తెలియడంతో గొంతుకోసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.