యాప్నగరం

ఆఫీస్ టైం అయిపోయిందన్న ఉద్యోగి.. వేలు తెగిపడేలా కొరికిన మేనేజర్

మేనేజర్ కారులో ఇద్దరూ పనిమీద బయటికెళ్లారు. ఈలోగా సాయంత్రమైంది. ఆఫీస్ టైం అయిపోయింది సార్ అంటూ మోహిత్ ఇంటికెళ్తాననడంతో ఆయనకి కోపం వచ్చింది. చివరికి..

Samayam Telugu 13 Sep 2020, 1:59 pm
ఆఫీస్ టైం అయిపోయింది.. ఇంటికెళ్తానన్న ఉద్యోగిపై ఆగ్రహంతో ఊగిపోతూ వేలు కొరికేశాడో మేనేజర్. ఆయన కొరికిన దెబ్బకి ఆ చేతి వేలు తెగిపడిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని మయూర్ విహార్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌కి చెందిన మోహిత్ కుమార్ ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని పై అధికారి హేమంత్ సిద్ధార్థ్ పనిమీద బయటికెళ్లాల్సి ఉందని.. రమ్మని చెప్పడంతో అక్షరధామ్‌ వద్ద కలుసుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అనంతరం సిద్ధార్థ్ కారులో కరోల్‌బాగ్ ఏరియాకి వెళ్లారు. పనులు పూర్తయ్యేప్పటికి సాయంత్రం కావడంతో మోహిత్ ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆఫీస్ టైం ముగిసింది తాను వెళ్తానని చెప్పడంతో మరోచోటుకి వెళ్లాల్సి ఉందని సిద్ధార్థ్ చెప్పాడు. కారులో వెళ్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన సిద్ధార్థ్.. పని సరిగ్గా చేయడం లేదంటూ మోహిత్‌‌‌పై చేయి చేసుకున్నాడు.

Also Read: ఎక్కడికెళ్లినా వీడియోకాల్ చేయమంటున్న భర్త.. భరించలేక భార్య ఆత్మహత్య

అధికారి ప్రవర్తనపై కోపమొచ్చిన మోహిత్ తిరగబడ్డాడు. ఇద్దరి మధ్య కారులోనే తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో మోహిత్ చేతి వేలిని అమాంతం కొరికేశాడు సిద్ధార్థ్. అతను బలంగా కొరకడంతో మోహిత్ చేతి వేలు తెగి కారులో కిందపడిపోయింది. కారులో నుంచి కిందకు దిగిన సిద్ధార్థ్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తెగిపడిన చేతివేలిని అతికించేందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: పెళ్లైన 15 రోజులకే భర్త మృతి.. మెడికో ఆత్మహత్యాయత్నం.. ఖాకీల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.