యాప్నగరం

భర్తపై అలిగి మూడేళ్ల కుమార్తెతో సహా వివాహిత అదృశ్యం

భార్య ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనపడిన చరణ్‌దాస్ వెంటనే చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై చిలకలగూడ ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 9 Dec 2019, 9:46 am
కుటుంబ కలహాల కారణంగా భర్తపై అలిగిన మహిళ కుమార్తెతో సహా అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చరణ్‌దాస్, అనూష దంపతులు పార్శీగుట్టలోని సంజీవపురంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొద్దిరోజులు భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu missing


Also Read: హైదరాబాద్‌లో సెల్ఫీ తెచ్చిన తంట.. పార్కులో యువతీయువకుల ఘర్షణ

ఈ నెల 6న దంపతుల మధ్య మరోసారి గొడవ జరగడంతో చరణ్‌దాస్ బయటకు వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష అదే రోజు మధ్యాహ్నం తన అన్నకు ఫోన్‌ చేసి తాను చిన్నకుమార్తె రితిక (3)ను తీసుకుని హుజూరాబాద్‌లోని పుట్టింటికి వెళుతున్నానని, పెద్ద కూతురు మన్విత(5)ను స్కూల్ నుంచి తీసుకు రావాలని భర్త చరణ్‌దాస్‌కు చెప్పాలని సూచించింది.

Also Read: పక్కింటి యువకుడి నిర్వాకం.. ప్రేమ పేరుతో బాలికను రేప్ చేసి పరార్

అయితే సాయంత్ర వేళ ఇంటికి వచ్చిన చరణ్‌దాస్ అత్తమామలకు ఫోన్ చేయగా అనూష్ తమ వద్దకు రాలేదని చెప్పారు. ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనపడిన అతడు వెంటనే చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై చిలకలగూడ ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనూష మిస్సింగ్‌పై రెండు కుటుంబాల్లో ఆందోళన చెందుతున్నాయి.

Also Read: హోటళ్లలో హైటెక్ వ్యభిచారం.. విశాఖలో ఇద్దరు బ్రోకర్లు అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.