యాప్నగరం

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

రాజేంద్రనగర్‌లోని జనావాసాల మధ్య సాగుతున్న ప్లాస్టిక్ గోడౌన్లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ సుమారు కిలోమీటరు వరకు వ్యాపించింది.

Samayam Telugu 23 Jan 2020, 10:15 am
హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్ర నగర్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని దానిమ్మ ప్రాంతంలో ఈ ప్లాస్టిక్ గోదాం ఉంది. నివాస ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ గోదాములో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Samayam Telugu pjimage (4)


Also Read: ఖమ్మంలో బాలికపై అత్యాచారం.. మాజీ సర్పంచిని చితక్కొట్టిన స్థానికులు

ప్లాస్టిక్ గోడౌన్ నుంచి దట్టమైన పొగలు దాదాపు కిలోమీటరు వరకు వ్యాపించాయి. నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందన్న అంచనాతో పోలీసులు కొందరి ఇళ్లను ఖాళీ చేయించారు. రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగతో స్థానికులు చాలాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Also Read: ఈ దొంగ మహిళల లోదుస్తులు మాత్రమే ఎత్తుకెళ్తాడు

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ గోదాముకు ఎలాంటి అనుమతులు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు పెద్దల అండదండలతో దీన్ని అక్రమంగా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

Also Read: విజయవాడలో ఇద్దరు ఆటోడ్రైవర్ల ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.