యాప్నగరం

మేడ్చల్: ప్రియురాలి మోజులో కూతుర్ని చంపేశాడు

మేడ్చల్ గుర్తు తెలియని బాలిక హత్య కేసును చేధించిన పోలీసులు. కన్నతండ్రే కూతుర్ని కిరాతకంగా చంపినట్లు గుర్తింపు.. నిందితుడి అరెస్ట్. హత్యకు కారణాలు తెలుసుకొని షాక్.

Samayam Telugu 21 Jul 2019, 5:26 pm
హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో సంచలనం రేపిన బాలిక మర్డర్ మిస్టరీ వీడింది. బాలికను తండ్రే అతి కిరాతకంగా చంపి.. మూటకట్టి పడేసినట్లు తేలింది. ప్రియురాలి మోజులో పడి.. కన్నబిడ్డను హతమార్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు చెప్పిన నిజాలు తెలుసుకొని పోలీసులే కంగుతిన్నారట.
Samayam Telugu hyd


బాలిక తండ్రికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందట. ఈ విషయం తెలుసుకున్న బాలిక.. తండ్రిని ప్రశించిందట. దీంతో ఆమెపై తండ్రి కక్ష పెంచుకున్నాడట.. ఆ కోపంతోనే బాలికను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడట. కిరాతకంగా కూతురి గొంతు కోసి.. ఆనవాళ్లు తెలియకుండా మొహంపై చర్మాన్ని చెక్కి రెండు కళ్లను పీకేశాడు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి కింది బస్తీలో పడేశాడు.

గోనె సంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. డాగ్‌స్వ్కాడ్‌‌ను రంగంలోకి దించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దగ్గరలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటూ వర్షం కురుస్తుండటంతో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి తండ్రిపై అనుమానంతో ప్రశ్నించడంతో మిస్టరీ వీడిందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.