యాప్నగరం

కల్తీ మద్యం తాగి నలుగురి మృతి... మరో ఇద్దరు కొనప్రాణాలతో

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కొన ప్రాణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 4 May 2020, 12:25 pm
లాక్‌డౌన్ సమయంలో మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులు ఏది దొరికితే అది తాగేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌‌లోని రత్లం జిల్లా నిమాలి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శనివారం మద్యం తాగారు. వీరిలో ఆరుగురు వ్యక్తులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని రత్లం జిల్లా ఆస్పత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో పోరాడుతున్నారు.
Samayam Telugu Image


Also Read: హైదరాబాద్ పాతబస్తీలో రెండు వర్గాల ఘర్షణ.. రాళ్లదాడి

మృతులను రితురాజ్ సింగ్ (35) విక్కీ సింగ్ (21), జైసింగ్ సింగ్ (26), అర్జున్ నాథ్ (22)గా గుర్తించినట్లు రత్లం జిల్లా ఎస్పీ గౌరవ్ తివారీ తెలిపారు. కల్తీ మద్యమే ఘటనకు కారణంగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తు చేపడతామని ఎస్పీ తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో అక్రమార్కులు నకిలీ మద్యం తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

Also Read: కామ కోరికలతో రగిలిపోయి.... ఇంటి యజమాని కుమార్తెపైనే అఘాయిత్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.