యాప్నగరం

పెన్షన్ డబ్బుల కోసం నాయనమ్మ హత్య.. రంగారెడ్డి జిల్లాలో దారుణం

తన జల్సాల కోసం పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ బాలుడు నాయనమ్మను కోరాడు. ఆమె లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురై కిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు.

Samayam Telugu 2 Jun 2020, 7:47 am
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం ఓ బాలుడు నాయనమ్మను అతి కిరాతకంగా చంపేశాడు. సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. మొయినాబాద్ పరిధిలోని శ్రీరాంనగర్‌ గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ(65) భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుకు పదేళ్ల క్రితం యాక్సిడెంట్‌లో మృతిచెందాడు. దీంతో కోడలు, ఇద్దరు మనుమళ్లు, మనవరాలితో కలిసి వెంకటమ్మ ఒకే ఇంట్లో ఉంటోంది. ఆమె రెండో మనవడు(16) ఎనిమిదో తరగతి తర్వాత చదువు మానేసి జులాయిగా మారాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Boy Kills Grand Mother in telangana


Also Read: సెల్‌ఫోన్ కొనలేదని ఆత్మహత్య చేసుకున్న యువతి.. కోరుకొండలో విషాదం

తన జల్సాల కోసం పెన్షన్ డబ్బులివ్వాలంటూ నాయనమ్మను తరుచూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం కోడలు, పెద్దమనవడు, మనవరాలు బంధువుల ఇంటికి వెళ్లగా వృద్ధురాలు, ఆమె రెండో మనవడు ఇద్దరే ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో బాలుడు డబ్బులివ్వాలని వెంటకమ్మను కోరగా ఆమె లేవని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడు ఆమెను తీవ్రంగా కొట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ ఇంటికొచ్చి తన బెల్టుతో నాయనమ్మ గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఏమీ ఎరుగనట్లుగా స్నేహితుడి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. సోమవారం మధ్యాహ్నమైన వెంకటమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్లు కిటికీలో నుంచి చూడా ఆమె విగతజీవిగా కనిపించింది.

Also Read: ఆంటీతో అఫైర్, మద్యం మత్తులో కొట్టి సజీవ సమాధి... నెల్లూరులో దారుణం

దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్‌ జానయ్య, ఎస్సై జగదీష్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడు ఆదివారం ఎవరెవరిని కలిశాడు..? హత్య చేసిన అనంతరం ఎవరి ఇంట్లో పడుకున్నాడు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: యువతి శీలానికి రూ.2లక్షలు వెలగట్టిన పెద్దలు.. వరంగల్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.