యాప్నగరం

కారులో శవమై కనిపించిన జర్నలిస్ట్.. పరారీలో ప్రియురాలు, సీన్ కట్ చేస్తే

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అషు యాదవ్ అనే జర్నలిస్ట్ హత్యను పోలీసులు చేధించారు. ప్రియురాలే అతడికి మద్యం తాగించి గొంతు నులిమి చంపేసినట్లు నిర్ధారించారు.

Samayam Telugu 5 Jan 2021, 9:33 am
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన జర్నలిస్ట్ అషూ యాదవ్ హత్య కేసును పోలీసులు చేధించారు. అషూ యాదవ్‌ను అతడి ప్రియురాలే హత్య చేసిందని తేల్చారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండగా.. సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు చెందిన అషు యాదవ్ కొంతకాలం క్రితమే జర్నలిస్టుగా ఉద్యోగంలో చేరారు. అతడు కనిపించడం లేదంటూ జనవరి ఒకటో తేదీన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu Image


Also Read: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడని అర్ధరాత్రి ఘాతుకం

ఈ నేపథ్యంలోనే జనవరి 2న సీటీఐ చెరువు సమీపంలో ఓ కారు అనుమానాస్పద స్థితిలో ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడి చేరుకుని కారును తనిఖీ చేయగా వెనుక సీటులో ఓ మృతదేహం కనిపించింది. అది అషు యాదవ్‌దేనని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తులో అతడిని ప్రియురాలే చంపేసిందని తెలిసి పోలీసులు షాకయ్యారు.

Also Read: బాలికను ఎత్తుకెళ్లిన పక్కింటి వ్యక్తి.. కారణం తెలిసి షాకైన పోలీసులు, చివరికి

ఆ యువతికి అషు యాదవ్‌ కంటే ముందే అమిత్ అనే యువకుడితో లవ్ అఫైర్ ఉందని, ఈ విషయం తెలుసుకున్న అషు యాదవ్ ఆమెను వేధించడంతోనే అమిత్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ రాత్రి అషుకు ఫోన్ చేసిన యువతి ఓ చోటికి రప్పించింది. అక్కడ అతడితో మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక అమిత్‌తో కలిసి గొంతు నులిమి చంపేసింది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉండగా పోలీసులు అమిత్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.