యాప్నగరం

నగ్నంగా నర్తించాలంటూ డ్యాన్సర్లకు యువకుల వేధింపులు

మహిళలతో నగ్నంగా డ్యాన్స్ చేయిస్తామంటూ ప్రకటన ఇచ్చారు. అధిక ధరలకు టికెట్లు అమ్ముకున్నారు. కానీ, డ్యాన్సర్లకు ఆ విషయం తెలియదు. తీరా షో ప్రారంభమయ్యాక నగ్నంగా నర్తించాలంటూ డ్యాన్సర్లను యువకులు వేధించారు.

Samayam Telugu 10 Jun 2019, 8:47 pm
గ్నంగా నర్తించాలంటూ కొంత మంది డ్యాన్సర్లను 500 మంది వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. అందుకు వారు నిరాకరించడంతో అసభ్యంగా ప్రవర్తించారు. తప్పించుకొని పారిపోతున్న వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మహిళలతో నగ్నంగా డ్యాన్స్ చేయిస్తామంటూ నిర్వాహకులు అధిక ధరలకు టికెట్లు అమ్ముకొని మోసం చేయడానికి ప్రయత్నించడమే ఈ ఘటనకు కారణమైంది. కల్చరల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం శోచనీయం. అసోంలోని కమ్‌రూప్ జిల్లాలో శుక్రవారం (జూన్ 8) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu dancer
Representational Image


అసోంలోని అసోల్‌పారాలో నగ్న నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్నామంటూ షాహ్‌రుఖ్ ఖాన్, సుభాహాన్ ఖాన్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌ నుంచి కొంత మంది డ్యాన్సర్లను రప్పించారు. షోను చూసేందుకు వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు అమ్మారు.

ట్రూప్ డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తుండగా.. నగ్నంగా నృత్యం చేయాలంటూ అక్కడికి వచ్చిన సుమారు 500 మంది యువకులు డిమాండ్ చేశారు. ఇందుకు డ్యాన్సర్లు నిరాకరించారు. డ్యాన్సర్లతో వారు అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడ్నుంచి వారు తప్పించుకున్నారు. ఎలాగోలా బయటపడి అక్కడ నుంచి పారిపోయారు. కొంత మంది యువకులు కోపంతో డ్యాన్సర్లు వెళ్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.

ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు షో నిర్వాహకులు షాహ్‌రుఖ్ ఖాన్, సుభాహాన్ ఖాన్‌లపై కేసు నమోదు చేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధిక మొత్తంలో డబ్బును వసూలు చేసేందుకే నగ్న నృత్య ప్రదర్శన అని ప్రకటన ఇచ్చారని.. ఆ విషయం డ్యాన్సర్లకు కూడా తెలియదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.