యాప్నగరం

ముగ్గురు కూతుళ్లలో ఒక్కరూ మిగల్లేదు.. చిత్తూరులో కంటతడి పెట్టించే విషాద ఘటన

పార్వతమ్మ దంపతుకి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. తోడికోడళ్లతో తగవులు.. భర్తతో విభేదాలతో పార్వతమ్మ దారుణ నిర్ణయం తీసుకుంది. కూతురితో సహా అఘాయిత్యానికి పాల్పడింది.

Samayam Telugu 16 Aug 2020, 2:26 pm
ఆ దంపతుల గ్రహపాటో.. దురదృష్టమో ముగ్గురు కూతుళ్లలో ఒక్కరూ మిగల్లేదు. ఒకరి తర్వాత మరొకరు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. క్షణాకావేశంలో తల్లి తీసుకున్న విపరీత నిర్ణయంతో అభం శుభం తెలియని చివరి కూతురు కూడా కానరానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ అత్యంత విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. శాంతిపురం మండలం సి.బండపల్లె పంచాయతీ చిన్నూరుకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఒకేచోట ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


పెద్దవాడైన రామక్రిష్ణప్ప భార్య పార్వతమ్మ(37)కి తన ఇద్దరు తోడికోడళ్లతో తరచూ గొడవలు జరుగుతుండేవి. దానికి తోడు భర్త మద్యానికి బానిసవడంతో కాపురంలో కలహాలు రేగాయి. ఇద్దరూ నిత్యం గొడవపడేవారు. సడెన్‌గా పార్వతమ్మ, ఆమె చిన్నకూతురు దివ్య(12) కనిపించకుండా పోయారు. తల్లీకూతుళ్ల కోసం అన్నదమ్ములు చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది.

మరుసటి రోజు మధ్యాహ్నం పొలంలోని వ్యవసాయ బావిలో చిన్నారి దివ్య శవమై తేలింది. అదే గ్రామానికి చెందిన నారాయణాచారి పొలానికి నీళ్లు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లడంతో దివ్య నీళ్లపై తేలియాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. బావిలో గాలించగా పార్వతమ్మ మృతదేహం కూడా లభ్యమైంది.

Also Read: భర్తని వదిలేసి బంధువుతో సెక్స్.. రెచ్చిపోయిన కూతురు.. తండ్రికి తెలియడంతో..

కుటుంబ కలహాల కారణంగా పార్వతమ్మ కూతురితో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న చివరి కూతురు కూడా విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. రామక్రిష్ణప్ప, పార్వతమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఒక కూతురు ఆరేళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో కూతురు ఆడుకుంటూ చింత చెట్టుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు మూడో కూతురు కూడా చనిపోవడం తీవ్రవిషాదం నింపింది.

Read Also: అత్త ఆస్తి కోసం అల్లుడి ఘాతుకం.. ఏలూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.