యాప్నగరం

తల్లీకొడుకుల బలవన్మరణం.. విజయవాడలో విషాదం

ఆర్థిక ఇబ్బందులతో తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అమ్మ లేదని తెలిసి తల్లడిల్లిపోయిన కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకరోజు వ్యవధిలోనే తల్లీకొడుకులు సూసైడ్ చేసుకుని చనిపోయారు.

Samayam Telugu 20 May 2020, 1:09 pm
ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని నిలువునా ముంచేశాయి. ఇల్లాలు ఆత్మహత్య చేసుకోగా.. అది తట్టుకోలేక ఆమె కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన షంషుద్దీన్, కరీమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. గతేడాది మచిలీపట్నం వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. అప్పుడు సుమారు మూడు లక్షల రూపాయల వరకూ అప్పులయ్యాయి. ఇటీవల పెద్ద కుమార్తె వివాహం జరిపించారు. ఆ సమయంలో మరికొంత అప్పులయ్యాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ప్రమాదంలో గాయపడినప్పటి నుంచి కరీమా ముభావంగా ఉండేది. మానసికంగా కుంగిపోయింది. దానికి తోడు అప్పులు బాగా కుంగదీశాయి. లక్షల్లో అప్పులు ఉండడం.. లాక్‌డౌన్ కారణంగా బంగారం పని చేసే భర్త ఖాళీగా ఉండడంతో ఆమెలో ఆందోళన మొదలైంది. అప్పులు తిరిగి కట్టే పరిస్థితి కనిపించక ఒత్తిడికి గురైంది. ఇంట్లో బంగారం పనిచేసే ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం కొడుకు నూరుద్దీన్‌ను తీవ్రంగా కలచివేసింది.

Also Read: గుంటూరు: ప్రియుడితో గొడవపడి వివాహిత ఆత్మహత్య.!

అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన నూరుద్దీన్ అదే ద్రావణం తాగి సూసైడ్ చేసుకున్నాడు. తల్లి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అప్పగించే లోపే కొడుకు మరణం తీవ్రంగా కలచివేసింది. ఒక్క ప్రమాదం కుటుంబంలో అశాంతిని రాజేసింది. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పురిగొల్పింది. తల్లి వెంటే కొడుకు కూడా నిష్క్రమించడం కంటతడి పెట్టించింది.

Read Also: సిగరెట్ వెలిగించలేదని మేనమామ ఘాతుకం.. కత్తితో పొడిచి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.