యాప్నగరం

టీఆర్ఎస్ ఎంపీనే బురిడీ కొట్టించే యత్నం.. కేటీఆర్ పేరు వాడుకొని ఘరానా మోసం

Banjara Hills: కేకే సూచనతో నిందితుడు బంజారాహిల్స్ కార్పొరేట్ అయిన ఆయన కుమార్తెకు ఫోన్ చేశాడు. అది నిజం అని నమ్మిన కార్పొరేటర్ తమ డివిజన్లలో నిరుద్యోగులకు ప్రయోజనం ఉంటుందని భావించి కొంతమందికి ఈ విషయం గురించి చెప్పారు.

Samayam Telugu 26 Aug 2020, 12:19 am
కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎంపీ కేకేను బురిడీ కొట్టించే యత్నం జరిగింది. దీంతో ఆయన మహేష్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంటూ ఎంపీ కేకేకు నిందితుడు ఫోన్ చేశాడు. 25 మంది నిరుద్యోగులకు రూ.25 లక్షల రుణం ఇస్తామని మహేష్ నమ్మబలికాడు. మంత్రి కేటీఆర్ సిఫార్సుతో మీకు ఇవ్వాలని అనుకుంటున్నామని ఎంపీ కేకేతో అనడం గమనార్హం. దీంతో ఈ విషయం గురించి తన కుమార్తె గద్వాల్ విజయ లక్ష్మితో మాట్లాడాలని మహేష్‌కు కేకే సూచించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Phone call fraud


Also Read: undefined

దీంతో నిందితుడు బంజారాహిల్స్ కార్పొరేట్ అయిన కేకే కుమార్తెకు ఫోన్ చేశాడు. అది నిజం అని నమ్మిన కార్పొరేటర్ తమ డివిజన్లలో నిరుద్యోగులకు ప్రయోజనం ఉంటుందని భావించి కొంతమందికి ఈ విషయం గురించి చెప్పారు. ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కొక్కరూ రూ.1.25 లక్షలు తన ఖాతాలో వేయాలని మహేష్ కోరాడు.

Must Read: రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట.. ‘మర్డర్’ సినిమాపై కీలక ఆదేశాలు

ఈ క్రమంలో అఖిల్ అనే యువకుడు రూ.50 వేలు వేశాడు. కాసేపటికి మహేష్ మాటలపై అనుమానం రావడంతో కేకే దీనిపై వాకబు చేశారు. బోగస్ అని తేలడంతో మిగిలిన వారు డబ్బులు వేయకుండా ఆపారు. డబ్బులు ఖాతాలో వేసిన అఖిల్ నిందితుడి గురించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: కరోనాపై తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. వచ్చే నెలాఖరు నాటికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.