యాప్నగరం

Mumbai: కిలాడి లేడీ... ముసలివాళ్లే టార్గెట్... వారికి హగ్‌లు ఇచ్చి ముంచేసింది

ముంబైలో (Mumbai) ఓ మహిళ ముసలవాళ్లను అడ్డంగా ముంచేసింది. రోడ్డుపై ఒంటరిగా ఉన్న వృద్ధులను గమనించి.. ఏదో ఒక వంకతో వారి దృష్టిని ఆకర్షించి.. వారికో కౌగిలింతను ఇచ్చేది. అలా హగ్ ఇచ్చినప్పుడు.. వారి దగ్గరుండే విలువైన వస్తువులను కొట్టేసింది. ఇలా చేసి చాలా డబ్బు, బంగారాన్ని ఆమె సొంతం చేసుకుంది. అయితే మలాద్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయమంతా బయటపడింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను పట్టుకున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 7 Oct 2022, 3:30 pm

ప్రధానాంశాలు:

  • బయటపడిన మహిళ చోరీలు
  • వృద్ధుల దగ్గర దొంగతనాలు
  • కౌగిలింతలతో విలువైన వస్తువుల చోరీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu woman hugged elderly to steal
ముంబైలో (Mumbai) ఓ కిలాడి లేడీ రోడ్డుపై ఒంటరి ముసలవాళ్లనే టార్గెట్ చేసి.. ఏదో ఒక వంకతో వారికి దగ్గరై.. ఆపై వీడ్కోలుగా ఓ హగ్ ఇచ్చి.. వారిని అడ్డంగా ముంచేసింది. కౌగిలించుకుని.. వారి దగ్గరున్న బంగారాన్ని కొట్టేసింది. ఆ మహిళను మంగళవారం మలాడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ప్లాన్‌తో చాలామంది వృద్ధులను మోసం చేసిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం గీతా పటేల్ అనే మహిళ.. రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్లే వృద్ధులను, ఆటోల్లో వెళ్లే సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకునేది. ఏదో వంకతో వారి దృష్టిని ఆకర్షించేది. ఆ తర్వాత వీడ్కోలు చెబుతూ వారికి ఒక కౌగిలింత ఇచ్చేది. అలా హగ్ ఇచ్చే సమయంలో ఆ వృద్ధుల దగ్గర ఉన్న బంగారు చెయిన్ లేదా ఫోన్, పర్సును ఇలా ఏదో ఒక కొట్టేసేది. ఇలా చాలాసార్లు చేసి గీతా పటేల్ లక్షలాది రూపాయల విలువైన బంగారాన్ని, డబ్బును అపహరించింది.

మలాద్‌కు చెందిన ఓ సీనియర్‌ సిటిజన్‌ దగ్గరు నుంచి కూడా గీతా పటేల్ బంగారు గొలుసును దోచుకుంది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 72 ఏళ్ల వృద్ధుడు షాపింగ్ ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా పటేల్ లిఫ్ట్ అడిగింది.. ఓ భవనం ముందు ఆటోను ఆపమని చెప్పి ఆ వ్యక్తిని కౌగిలించుకుని నెక్లెస్‌లోని బంగారు గొలుసును తీసేసింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ వృద్ధుడు దొంగతనం జరిగినట్టు గుర్తించాడు. మరుసటి రోజు అతను మలాడ్ పోలీసులను ఆశ్రయించాడు.

అయితే అప్పటి నుంచి గీతా పటేల్ పరారీలో ఉంది. సీనియర్ ఇన్‌స్పెక్టర్ రవి అధానే ఆధ్వర్యంలో పోలీసు అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించి నిందితుల ఆచూకీ కనిపెట్టింది. సోమవారం మీరా భయందర్ దగ్గర నిందితురాలని పట్టుకున్నారు. ఆమెను పోలీసు కస్టడీకి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. చార్కోప్, మలాద్, బోరివ్లీ, మీరా రోడ్ తదితర ప్రాంతాల్లో పటేల్ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

Read Also:ఒక పెళ్లికే దిక్కులేదంటే.. 28 ఏళ్లకు 24 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.