యాప్నగరం

హైదరాబాద్‌లో తల్లీకొడుకుల కిడ్నాప్.. నిందితుల కోసం పోలీసుల వేట

బుధవారం ఉదయం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న ఆదిలక్ష్మిని, ఆమె కొడుకును దుండగులు కారులో కిడ్నాప్ చేశారు.

Samayam Telugu 9 Jul 2020, 9:00 am
హైదరాబాద్‌ నగరంలోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తల్లీ, కొడుకు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని గంధంగూడకు చెందిన ఆదిలక్ష్మి(37) నాంపల్లి కోర్టులో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా కొద్దిరోజులుగా ఆమె ఇంటికే పరిమితమైన ఆమె రోజూ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం ఇద్దరు కొడుకులతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మితో పాటు ఓ కుమారుడు ప్రజ్వన్‌ను అపహరించారు.
Samayam Telugu Image


Also Read: అర్ధరాత్రి వివాహితపై అఘాయిత్యం.. హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం

తల్లీ కొడుకును కిడ్నాపర్లు కారులో బలవంతంగా ఎక్కిస్తుండగా ఆలయ పూజారి గమనించి వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే ఆలయం వద్దకు చేరుకుని పూజారి నుంచి వివరాలు సేకరించారు. వారి కోసం గాలిస్తుండగానే కిడ్నాపర్లు చేవెళ్ల వైపు కారులో వెళ్తున్నట్లు సమాచారం అందించింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు ఆ మార్గంలో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు చేవెళ్ల వద్ద వారిద్దరిని కారులో నుంచి దించేసి పరారయ్యారు.

Also Read: కీచక బాయ్‌ఫ్రెండ్.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై అత్యాచారం

పోలీసులు ఆదిలక్ష్మి, ఆమె కొడుకును అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు అప్పగించడందో కథ సుఖాంతమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆదిలక్ష్మి ఆంజనేయస్వామి దేవాలయంలో రోజూ 11 ప్రదక్షిణలు చేయడానికి వస్తుంటారని ఆలయ పూజారి చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు గుడిలోనే ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారన్నది దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అత్తింటి వేధింపులు.. పెళ్లయిన 4నెలలకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.