యాప్నగరం

ఆడపడుచు భర్తతో అఫైర్.. తప్పని చెప్పినా వినలేదు.. చివరికి భర్త చేతిలో

అక్రమ సంబంధాల కారణంగా చాలామంది వావివరుసలు కూడా మరిచిపోతున్నారు. తాత్కాలిక సుఖం కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు వరుసయ్యే వారితో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాగే వరుసకు సోదరుడయ్యే(ఆడపడుచు భర్త) వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. అంతటితో ఆగకుండా సోదరి కొడుకును కూడా హత్య చేసిన అతడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. నాసిక్ లోని బసవంత్ టౌన్ లో రవీంద్ర నగ్మల్, సురేఖ (32) దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు రవీంద్ర సోదరి కుమారుడు విశాల్ (10) అక్కడే నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. కొడుకును చూసేందుకు రవీంద్ర సోదరి దంపతులు అప్పుడప్పుడూ అతడి ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలోనే సురేఖ, రవీంద్ర బావ మధ్య చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. కొడుకును చూడాలన్న వంకతో అతడు తరుచూ వారింటికి ఒక్కటే వచ్చి సురేఖలో రాసలీలలు కొనసాగించేవాడు.

Samayam Telugu 23 Mar 2020, 11:52 am

Samayam Telugu nasik man kills wife over her illicit affair with brother
ఆడపడుచు భర్తతో అఫైర్.. తప్పని చెప్పినా వినలేదు.. చివరికి భర్త చేతిలో

​భర్త బయటకు.. ప్రియుడు ఇంట్లోకి ఎంట్రీ

ఓ రోజు రవీంద్ర పనిమీద బయటకు వెళ్లగానే అతడి బావ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వారిద్దరూ బెడ్రూమ్‌లో రాసలీలలు మొదలుపెట్టారు. అయితే భార్య ప్రవర్తనపై ఎప్పటి నుంచో అనుమానం పెంచుకున్న రవీంద్ర మార్గమధ్యలోనే ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ తలుపులు తీయగా తన భార్య, సోదరి భర్త నగ్నంగా అసభ్యకర రీతిలో మంచంపై ఉండటాన్ని రవీంద్ర చూసి షాకయ్యాడు. ఈ విషయం బయటకు తెలిస్తే రెండు కుటుంబాల పరువు పోతుందన్న ఉద్దేశంతో వారిని క్షమించి ఇకపై బుద్ధిగా ఉండాలని హెచ్చరించి వదిలేశాడు.

Also Read: నిద్రపోతున్న భర్తకు ఉరేసి చంపిన ఇల్లాలు.. ఆపై ప్రియుడితో పరార్

​భర్త ఎదుటే ప్రియుడితో ముచ్చట్లు

పరాయి మగాడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటికీ క్షమించిన భర్తను మంచి మనసును అర్ధం చేసుకోని సురేఖ మరింత రెచ్చిపోయింది. తన వ్యవహారం భర్తకు తెలిసిపోవడంతో అతడి ఎదుటే ప్రియుడితో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడేది. భార్య తీరుపై విసిగిపోయిన రవీంద్ర రెండ్రోజుల క్రితం ఆమెతో గొడవపడి పద్ధతి మార్చుకుంటావా? చస్తావా? అని బెదిరించాడు. మీ బెదిరింపుకు నేను భయపడనని సురేఖ ఎదురు చెప్పడంతో ఆగ్రహానికి గురై కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు.

Also Read: వితంతువుతో అక్రమ సంబంధం.. ఆమె మరిది, కొడుకు చేతిలో దారుణహత్య

​అడ్డొచ్చిన మేనల్లుడిని కూడా..

అడ్డుకునేందుకు వచ్చిన మేనల్లుడు విశాల్(10) గొంతు కోసేశాడు. అనంతరం తీవ్ర మనోవేదనకు గురై గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఇంట్లోని వారెవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించగా మూడు మృతదేహాలు గుర్తించారు. గదిలో రవీంద్ర రాసిన సూసైడ్ నోట్‌‌ను పోలీసులు పరిశీలించారు. సోదరుడు అయ్యే తన బావతో భార్య సురేఖ అక్రమ సంబంధం సాగిస్తోందని, అందుకే చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని రవీంద్ సూసైడ్ నోట్‌లో వివరించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఉద్యోగం పేరుతో భర్త మోసం.. పెళ్లయిన వారం రోజులకే యువతి ఆత్మహత్య

భర్త స్కూల్‌కి వెళ్లగానే ప్రియుడితో రొమాన్స్

పుణె నగరానికి చెందిన ఓ యువకుడు ఓ స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2007 మార్చిలో అతడికి ఓ యువతితో వివాహమైంది. రెండేళ్ల తర్వాత ఓ బాబు పుట్టాడు. పెళ్లయినప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలంటూ ఆమె రోజూ భర్తతో గొడవ పడేది. ఓ రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి మూడు రోజుల తర్వాత తిరిగొచ్చింది. ఎక్కడికి వెళ్లావని భర్త ప్రశ్నించగా నీకెందుకు చెప్పాలని ఎదురు తిరిగింది. భార్య వేధింపులు భరించలేక కొద్దిరోజుల తర్వాత అతడు వేరు కాపురం పెట్టాడు. అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదు. భర్త ఇంటికొచ్చినా పట్టించుకోకుండా ఎప్పుడూ ఫోన్లో ఛాటింగ్ చేస్తూ కనిపించేది. ఓ రోజు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడటాన్ని చాటుగా విన్న భర్త షాక్‌కు గురయ్యాడు. భార్య ఎవరితోనే సన్నిహితంగా మెలుగుతోందని గ్రహించిన ఆ వ్యక్తి ఆమెకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ రోజు సాయంత్రం ఆ పుటేజీని చూస్తూ షాక్‌కు గురయ్యాడు. పరాయి వ్యక్తితో తన భార్య బెడ్రూమ్‌లో రాసలీలలు సాగిస్తుండటంతో ఆమె అక్రమ సంబంధం గుట్టు రట్టయింది.

Also Read: మటన్ కర్రీ కోసం ఘర్షణ.. అన్న చేతిలో తమ్ముడి దారుణహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.