యాప్నగరం

గ్రహణ సమయంలో కన్యను బలిస్తే మంచిదని.. నేపాల్ నుంచి యువతిని తీసుకొచ్చి

సూర్యగ్రహణం రోజున కన్యను బలి ఇస్తే మంచి జరుగుతుందన్న ఆలోచనతోనే ఆమెను తీసుకొచ్చినట్లు చెప్పడంతో అంతా షాకయ్యారు. అయితే నరబలి ఇచ్చేందుకు ఎవరో వీరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 27 Dec 2019, 11:55 am
మోడలింగ్ రంగంలో రాణించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకున్న నేపాల్ యువతి బిహారీ గ్యాంగ్‌కు చిక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమె ఆసక్తిని గమనించి మోడల్‌ను చేస్తామని నమ్మించిన ఓ మహిళ దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చి ఓ గ్యాంగ్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి గ్యాంగ్ ఆఖరి నిమిషంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి ప్రాణాలతో బయటపడింది.
Samayam Telugu pjimage


Also Read: యువకుడితో లాడ్జిలో రొమాన్స్ చేసి.. రూ.4.49లక్షలు దోచుకున్న కిలేడీ

నేపాల్‌కు చెందిన ఓ యువతి మోడల్‌గా రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమెకు ఇటీవల బిహార్‌కు చెందిన మహిళ ఆన్‌లైన్లో పరిచయమైంది. ఇండియాకు వస్తే మోడల్‌ని చేస్తానని, భోజ్‌పురి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని మహిళ చెప్పడంతో ఆ యువతి నమ్మేసింది. దీంతో ఆ మహిళతో పాటు మరో ఆరుగురు కలిసి ఆమెను ఖాట్మండ్ నుంచి బిహార్‌లోని బోగ్బానీకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మరో గ్యాంగ్ ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్‌చేసి చెప్పడంతో వారు అక్కడ తనిఖీలు చేసి యువతిని రక్షించారు.

Also Read: అల్లుడితో అత్త రొమాన్స్.. ఇద్దరినీ మంచంపై చూసి షాకిచ్చిన భర్త

ఆమెను బిహార్‌కు తీసుకొచ్చిన ఏడుగురిని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సూర్యగ్రహణం రోజున కన్యను బలి ఇస్తే మంచి జరుగుతుందన్న ఆలోచనతోనే ఆమెను తీసుకొచ్చినట్లు చెప్పడంతో అంతా షాకయ్యారు. అయితే నరబలి ఇచ్చేందుకు ఎవరో వీరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి రూ.1,09,500 నగదు, మొబైల్ ఫోన్స్, రూ.9 లక్షలకు సంబంధించి ఏడు బ్యాంక్ చెక్కులు, ఏడు ఏటీఎం కార్డులు, నరబలి, క్షుద్రపూజలకు వినియోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను తిరిగి నేపాల్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు చెప్పినదంతా నమ్మింతే ఇలాంటి సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు ఆమెకు హితవు పలికారు.

Also Read: కిడ్నాప్ చేసి ఏడాదిన్నరగా 11మంది గ్యాంగ్ రేప్.. బిడ్డకు జన్మనిచ్చినా వదలని కామాంధులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.