యాప్నగరం

పెళ్లయిన ఐదు రోజులకే ఫ్యాన్‌కు వేలాడిన నవవధువు

అత్త శివశక్తి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంబమ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 8 Nov 2019, 1:39 pm
కాళపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో కలకలం రేపింది. తేని జిల్లా కంబమ్ ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ కుమార్తె శివశక్తి(18)కి స్థానికంగా నివసించే సేతుపతి(22) అనే యువకుడితో నవంబర్ ఒకటో తేదీన ఘనంగా వివాహమైంది.
Samayam Telugu newly married woman commists suicide in tamilnadu
పెళ్లయిన ఐదు రోజులకే ఫ్యాన్‌కు వేలాడిన నవవధువు


Also Read: ఆమెను రేప్ చేసి చంపేశారు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు

దీంతో శివశక్తి అత్తగారింటికి వచ్చింది. బుధవారం ఉదయం సేతుపతి ఓ పని నిమిత్తం బయటకు వెళ్లడంతో నవవధువు ఒంటరిగా గదిలోనే ఉండిపోయింది. అయితే సాయంత్రమైనా ఆమె బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అత్త పుష్పవళ్లి గదిలోకి వెళ్లి చూడగా శివశక్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

Also Read: 12ఏళ్ల బాలికను ప్రియుడు రేప్ చేస్తుంటే వీడియోలు తీసిన ఫ్రెండ్స్

దీంతో ఆమె అత్త శివశక్తి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంబమ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. శివశక్తికి పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఒక్కగానొక్క కూతురు పెళ్లయిన ఐదు రోజులకే ఆత్మహత్య చేసుకోవడంతో శివశక్తి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Also Read: చెత్తకుప్పలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన హైదరాబాద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.