యాప్నగరం

ఖమ్మంలో కామాంధుడు.. ఏడేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం

శనివారం ఇంటి దగ్గర తమ్ముడితో కలిసి ఆడుకుంటున్న బాలికను పక్కింట్లో ఉండే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పిలిచాడు. ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Samayam Telugu 26 Jul 2020, 8:30 am
వృధ్యాప్యంలోనూ కామంతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి మనవరాలి వయసుండే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నీచపు ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. బోనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం భార్యభర్తలు వ్యవసాయ పనులకు వెళ్లగా బాలిక(7) తమ్ముడితో కలిసి ఇంటి దగ్గరే ఆడుకొంటోంది. ఆమెపై కన్నేసిన పక్కింట్లో ఉండే బొల్లెపోగు వెంకటేశ్వర్లు(66) బాలికను పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఎంతసేపటికి అక్క తిరిగి రాకపోవడంతో తమ్ముడు లోపలికి వెళ్లాడు.
Samayam Telugu Image


Also Read: రెండేళ్లు కాపురం చేసి... బిడ్డ పుట్టాక భార్యను వదిలించుకున్న భర్త

ఆ సమయంలో బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడటం చూసి బయటకు వచ్చి కేకలు పెట్టాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు వెంకటేశ్వర్లును పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈలోగా ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకుని షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ కొండలరావు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: స్వధాత్రి ఇన్‌ఫ్రా స్కామ్‌లో కొత్తకోణం.. రూ.వెయ్యి కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిన రఘు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.