యాప్నగరం

ప్రియురాలి కోసం పార్కులోనే తన్నుకున్న యువకులు

యువతితో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి చీవాట్లు పెట్టారు. అందరూ రాజీకి రావడంతో కేసు నమోదు చేయకుండా వార్నింగ్ ఇచ్చి పంపేశారు.

Samayam Telugu 23 Dec 2019, 7:33 pm
ఓ యువతి కోసం ఇద్దరు యువకులు పార్కులోనే తన్నుకున్న ఘటన బిహార్ రాజధాని పాట్నాలో వెలుగుచూసింది. పాట్నాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన కుమారి(పేరు మార్చాం) స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. కొంతకాలంగా తర్వాత అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో దూరం పెట్టింది. ఇటీవల మరో యువకుడిని ప్రేమించి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది
Samayam Telugu hyd


Also Read: ప్రియుడితో వెళ్లింది.. పొదల్లో శవమై తేలింది.. మెదక్‌లో కలకలం

ఈ క్రమంలోనే కుమారి ఆదివారం తన తాజా ప్రియుడితో కలిసి బుద్ధ స్మృతి పార్కుకు వెళ్లింది. వీళ్లిద్దరు ప్రేమ ఊసులు చెప్పుకుంటుండగా ఈ సన్నివేశాన్ని ఆమె పాత ప్రియుడు చూశాడు. దీంతో ఆవేశం పట్టలేక వారి వద్దకు వచ్చి కుమారితో గొడవపడ్డాడు. పక్కనున్న ఆమె ప్రియుడు అడ్డుకోవడంతో వివాదం పెద్దదైంది. దీంతో ఆ యువకులిద్దరూ పార్కులోనే విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఆమెను వదిలేయాలంటూ ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు

Also Read: ఫస్ట్‌ నైట్ కాగానే డబ్బు, నగదుతో పారిపోయిన పెళ్లికూతురు

ఈ సన్నివేశాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని యువకులతో పాటు కుమారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారి పిల్లల ప్రవర్తన గురించి క్లాస్ పీకారు. ఆ ముగ్గురి పేరెంట్స్ రాజీకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటన మాత్రం పాట్నాలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: ‘మా బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు’.. కృపారాణి తల్లిదండ్రులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.