యాప్నగరం

చిచ్చుపెట్టిన దసరా... పెళ్లయిన ఐదు నెలలకే మహిళ ఆత్మహత్య

దసరా పండక్కి పుట్టింటికి వెళ్లే విషయంలో భర్తతో గొడవపడిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 7 Oct 2019, 8:57 am

ప్రధానాంశాలు:

  • కొత్త కాపురంలో చిచ్చుపెట్టిన దసరా పండుగ
  • పుట్టింటికి వెళ్లే విషయంలో భర్తతో గొడవపడిన మౌనిక
  • ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu suicie
కొత్త జంట కాపురంలో దసరా పండగ చిచ్చు రేపింది. పండగకు పుట్టింటికి వెళ్లే విషయంలో దంపతుల మధ్య చెలరేగిన వివాదం విషాదం నింపింది. పెళ్లయిన ఐదు నెలలకే మనస్తాపంతో భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Also Read: మామ-కోడలి అక్రమ సంబంధం... ఇద్దరినీ చంపేసిన భర్త

ప్రకాశం జిల్లా టంగుటూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన కుంచాల వరుణ్‌కు కందుకూరు మండలం పలుకూరుకు చెందిన మౌనిక(21)ను ఇచ్చి అయిదు నెలల కిత్రం వివాహం చేశారు. కుమార్తె, అల్లుడిని దసరా పండగకు ఇంటికి ఆహ్వానించేందుకు మౌనిక తండ్రి రెండు రోజుల క్రితం అల్లుడు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా పుట్టింటికి వెళ్లే విషయంలో మౌనిక భర్తతో గొడవపడింది. ఆదివారం భర్త బయటకు వెళ్లిన సమయంలో మౌనిక గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read: వాట్సాప్‌లో పోర్న్ వీడియోలు పంపుతూ యువతికి వేధింపులు

కాసేపటి తర్వాత ఇంటి నుంచి వచ్చిన వరుణ్ భార్య ఫ్యాన్‌కు వేలాడటాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. దీంతో ఎస్సై రమణయ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఆస్తి కోసం అత్తమామలు, భర్త సహా ఆరుగురిని చంపేసింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.