యాప్నగరం

బలవంతంగా గర్భస్రావం మందులు తినిపించి.. కర్నూలులో దారుణం

ఆడబిడ్డ అన్న అనుమానమే ఓ నిండు గర్భిణి మరణానికి కారణమైంది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని భావించిన భర్త.. గర్భస్రావం చేయించేందుకు బలవంతంగా మందులు తినిపించడంతో భార్య మరణించిన ఘటన వెలుగుచూసింది.

Samayam Telugu 19 Mar 2020, 4:12 pm
సభ్యసమాజం తలదించుకునే సంఘటన వెలుగుచూసింది. ఆడబిడ్డ పుడుతుందేమోనన్న అనుమానం ఆ తల్లి ప్రాణాలు తీసేసింది. గర్భస్రావం చేయించేందుకు బలవంతంగా మందులు తినిపించడంతో అవి వికటించి వివాహిత మరణించిన దారుణ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. మొదట ఆడబిడ్డ పుట్టిందని.. మళ్లీ ఆడబిడ్డే పుడుతుందన్న అనుమానంతో బలవంతంగా ఇష్టమొచ్చిన మందులు తినిపించడంతోనే ఆమె మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu death4


కర్నూల్ కరీంబాగ్ కాలనీకి చెందిన షేక్ షాహినాకి అదే ప్రాంతానికి చెందిన షేక్ షావలి కుమారుడు షమీర్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. వారికి మొదటి సంతానం ఆడబిడ్డ జన్మించింది. షాహినా మరోసారి గర్భం దాల్చింది. అయితే తొలిసారి ఆడపిల్ల పుట్టిందని.. మళ్లీ ఆడబిడ్డే పుడుతుందని భావించిన భర్త షమీర్ భార్యతో ఏవేవో ట్యాబ్లెట్లు తినిపించేవాడు. గర్భస్రావం కోసం వైద్యులను సంప్రదించకుండానే ఇష్టమొచ్చిన మందులు వేయడంతో ఆమె పరిస్థితి విషమించింది.

Also Read: నా మొగుడ్ని చంపేస్తే బాగుండేది కదా.! ప్రియుడితో భార్య .. గుంటూరులో దారుణం

మందుల ప్రభావంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్తస్రావం అధికం కావడంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ మందులు వికటించడంతో పాటు.. అప్పటికే తీవ్రంగా రక్తం పోవడంతో షాహినా పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి వద్దకు చేరుకున్న షాహిన బంధువులు ఆందోళనకు దిగారు.

Read Also: కూతురు ప్రియుడితో వెళ్లిపోయిందని కిరాతకం.. యువకుడి తమ్ముడి తల నరికి వేరుచేసి..

భర్త కారణంగానే షాహినా మరణించిందని.. గర్భస్రావం చేయించేందుకు ఇష్టమొచ్చిన మందులు వాడడంతో వికటించి తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం షాహినా మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.