యాప్నగరం

పుట్టింటికి పంపలేదని గర్భిణి ఆత్మహత్య.. కృష్ణా జిల్లాలో విషాదం

రాజస్థాన్ నుంచి వలసొచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది. పుట్టింటికి వెళ్తానన్న భార్యకు వద్దని చెప్పడంతో ఆమె మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంది.

Samayam Telugu 23 Oct 2020, 12:01 pm
కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త పుట్టింటికి పంపించలేదని గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్థాన్‌కి చెందిన ప్రజాపతి మహీంద్ర కుటుంబం కొన్నేళ్ల కిందట నూజివీడు మండలం పల్లెర్లమూడికి వలసొచ్చింది. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మహీంద్ర భార్య ప్రజాపతి నిర్మ(24) ఇటీవల గర్భం దాల్చింది. ఆమె తన పుట్టింటికి వెళ్తానని కోరడంతో భర్త నిరాకరించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


ఇప్పుడు నాలుగో నెల నడుస్తోందని.. ఐదో నెల రాగానే పంపిస్తానని చెప్పడంతో భార్య నిరాశకు గురైంది. పుట్టింటికి వెళ్లేందుకు భర్త నిరాకరించాడని తీవ్ర మనస్థాపానికి గురైన భార్య నిర్మ అఘాయిత్యం చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరి బిగించుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘వచ్చి అరెస్టు చేయండి.. వెయిట్ చేస్తుంటా’.. పోలీసులకు యువతి షాకింగ్ ఫోన్ కాల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.