యాప్నగరం

ప్రేమ పేరుతో యువతిని లొంగదీసుకుని... మోజు తీరాక మొహం చాటేశాడు

ఆమె క్రమంగా తన దారిలోకి వచ్చిందని తెలుసుకున్న మాథరం.. ఈ ఏడాది మార్చి 23 ఆమెకు మాయమాటలు చెప్పి ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన కోరిక తీర్చాలని యువతిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కొద్దిరోజులు ఇక్కడే ఉందామంటూ నమ్మించాడు.

Samayam Telugu 29 Nov 2019, 7:57 am
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఉదయ్‌పూర్ జిల్లాలోని రిషభదేవ్ జిల్లా భీన్మల్ జలోర్ హాల్ ప్రాంతానికి చెందిన గోపాల్ అలియాస్ విక్రమ్ కుమారుడు మాథరం పురోహిత్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితుడికి పరిచయమున్న ఓ యువతిపై అతడు కన్నేశాడు. ఆమెతో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. క్రమంగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానంటూ అతడు చెప్పిన మాటలను యువతి నమ్మింది.
Samayam Telugu RAPE4


Also Read: రాజకీయ నేతలకు వలపు వల.. రొమాన్స్ చేస్తూ వీడియోలు తీసి

ఆమె క్రమంగా తన దారిలోకి వచ్చిందని తెలుసుకున్న మాథరం.. ఈ ఏడాది మార్చి 23 ఆమెకు మాయమాటలు చెప్పి ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన కోరిక తీర్చాలని యువతిని కోరగా ఆమె నిరాకరించడంతో ఇంటికి తీసుకెళ్లిపోయాడు.
కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోవడానికి కొంత టైమ్ పట్టేలా ఉందని, ఈలోగా మనమధ్య ప్రేమ మరింత పెరగాలంటే శారీకరంగా కలుద్దామని చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. వీలైనప్పుడల్లా ఆమెను ఫ్రెండ్స్ రూమ్‌కి, లాడ్జిలకు తీసుకెళ్లి
చెప్పి లైంగికంగా అనుభవించాడు. అలా కొద్దిరోజుల పాటు యువతిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆ తర్వాత ఆమెకు మొహం చాటేశాడు.

Also Read: ప్రియుడితో సెక్స్ చేస్తుండగా చూసిందని.. మహిళను చంపేసిన 16ఏళ్ల బాలిక

బాధితురాలు అతడిని పట్టుకుని నిలదీయగా.. నీపై మోజు తీరిపోయింది, ఎవరి దారి వారు చూసుకుందామంటూ చెప్పడంతో షాకైంది. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: హన్మకొండ: పుట్టిన రోజు నాడే యువతి‌పై అత్యాచారం, హత్య.. క్లాస్‌మెట్ నిందితుడు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.