యాప్నగరం

ధోనీ ఇంట్లో దొంగతనం.. పనిమనిషిపై అనుమానాలు

నోయిడా 104 సెక్టార్‌ ప్రాంతంచాలా ఖరీదైనది. ఆ ప్రాంతంలో గతంలో ఓ ఇల్లు కొన్న ధోనీ దాన్ని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఆదివారం తన ఇంట్లో టీవీని దొంగిలించారని విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 1 May 2019, 11:56 am

ప్రధానాంశాలు:

  • ధోనీ ఇంట్లో దొంగతనం
  • నోయిడాలోని సెక్టార్ 104లో ఉన్న ఇంట్లో టీవీ దొంగతనం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu dhoni
ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇంట్లో దొంగతనం జరిగింది. ధోనీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 104లో ఓ ఇల్లు ఉంది. దీంట్లో విక్రమ్ సింగ్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నారు. ఆదివారం తన ఇంట్లో టీవీని దొంగిలించారని విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నోయిడా సెక్టార్ 104 ప్రాంతం చాలా ఖరీదైనది. అక్కడ గతంలో ఓ ఇల్లు కొన్న ధోనీ దాన్ని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తన ఇంట్లో ఉన్న మూడు ఎల్‌సీడీ టీవీల్లో ఒకటి కనిపించడం లేదని విక్రమ్ సింగ్ నోయిడా 39 సెక్టార్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ ప్రశాంత్ కపిల్ తెలిపారు.

టీవీ పోయిన తర్వాతి నుంచి ఇంటి పనిమనిషి కనిపించడం లేదని అందువల్ల అతడిపై అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ఇంట్లో రిపేరు పనులు జరుగుతున్నందున ఆ పనులు చేస్తున్న వారెవరైనా టీవీని దొంగిలించారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.