యాప్నగరం

కరాచీ బేకరీలో రూ.10లక్షల చోరీ.. హైదరాబాద్‌లో కలకలం

హైదరాబాద్ ఎంజే మార్కెట్ సమీపంలోని కరాచీ బేకరీలో దొంగలు పడ్డారు. ఏకంగా రూ.10లక్షల నగదు దోచుకుని పోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Samayam Telugu 29 Apr 2020, 2:35 pm

Search Results

హైదరాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. ఎంజే మార్కెట్ సమీపంలోని కరాచీ బేకరీలో దొంగలు ఏకంగా రూ.10లక్షల నగదు దోచుకుని పరారయ్యారు. పోలీస్ చెక్‌పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

Web results

మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలోని ఓ భవనంలో కరాచీ బేకరీ చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా పోలీసుల ఆంక్షలకు అనుగుణంగా అప్పుడప్పుడూ మాత్రమే ఈ బేకరీని తెరుస్తున్నారు.
Samayam Telugu karachi-bakery


Also Read: ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు.. లాక్‌డౌన్‌తో గుట్టురట్టు

అయితే బుధవారం ఉదయం బేకరీని తెరిచిన యజమానులు లాకర్‌ పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యారు. అందులో ఉండాల్సిన రూ.10లక్షల నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. భవనం మధ్యనున్న చిన్న సందు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీని వెనుకే పోలీస్ చెక్‌పోస్టు ఉన్నప్పటికీ దొంగలు ఇంత ధైర్యంగా ఎలా వచ్చారన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యజమానులు ఏకంగా రూ.10లక్షల నగదు బేకరీలో ఎందుకు ఉంచారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రేమోన్మాదానికి ఇంటర్ విద్యార్థిని బలి.. నాగర్‌కర్నూలులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.