యాప్నగరం

కళ్లల్లో స్పే కొట్టి రూ.30లక్షలు దోపిడీ... సికింద్రాబాద్‌లో కలకలం

రూ.30లక్షలతో రూపారామ్ మొదటి అంతస్తు నుంచి కిందికి దిగుతుండగా.. ఓ వ్యక్తి రూపారామ్‌పై పెప్పర్ స్ప్రే చల్లి నగదు సంచితో పరారయ్యాడు. బాధితుడు తేరుకుని చూసేసరికే దొంగ మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఉడాయించాడు.

Samayam Telugu 13 Nov 2019, 1:59 pm
సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. జనరల్ బజార్‌లో శ్రీనివాస వర్మ అనే వ్యక్తి రోహిత్ జ్యూవెలర్స్ పేరుతో బంగారం ఆభరణాలు తయారు చేసే దుకాణం నిర్వహిస్తున్నాడు. షాపుల వాళ్లు ఇచ్చిన అర్డర్లపై నగలు తయారుచేసి సరఫరా చేస్తుంటాడు. వీరి నుంచి ఎదురుగా ఉండే నవకార్ జ్యువెల్లరీ నగలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే లావాదేవీలకు సంబంధించి నవకార్ జ్యువెల్లరీస్ నుంచి రూ.30లక్షల నగదు శ్రీనివాస వర్మకు రావాల్సి ఉంది.
Samayam Telugu robbery


Also Read: నర్సుతో బెడ్‌రూమ్‌లో రొమాన్స్.. ఇద్దరికీ నిప్పుపెట్టిన డాక్టర్ భార్య

మంగళవారం రాత్రి అక్కడి నుంచి నగదు తీసుకురావాలని రూపారామ్ అనే వ్యక్తిని పంపించాడు. డబ్బు తీసుకున్న అతడు మొదటి అంతస్తు నుంచి కిందికి దిగుతుండగా.. ఓ వ్యక్తి రూపారామ్‌పై పెప్పర్ స్ప్రే చల్లి నగదు సంచితో పరారయ్యాడు. బాధితుడు తేరుకుని చూసేసరికే దొంగ మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఉడాయించాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస వర్మ వెంటనే మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: బాలికలకు చిత్రహింసలు పెడుతూ వ్యభిచారం.. మహిళ, ముగ్గురు విటుల అరెస్ట్

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దుండగులు పక్కా స్కెచ్‌తోనే దోపిడీ పాల్పడినట్లు తెలుస్తోంది. చాలారోజులుగా ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి ఉంటారని, మంగళవారం రాత్రి పెద్దమొత్తంలో నగదు చేతులు మారుతుందని సమాచారం అందుకుని దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

Also Read: ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కిల్లర్ కీర్తి... కూతుర్ని చూసేందుకు రాని తండ్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.