యాప్నగరం

ఇంట్లో మొండెం.. తల స్టీల్ క్యాన్‌లో పెట్టి.. ఎర్రగుంట్ల మర్డర్ కేసులో సంచలన నిజాలు

రిటైర్డ్ ఉద్యోగి రమణయ్య రాజకీయ నేతకు సుమారు రూ.50 లక్షలకు పైగా అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. అవి తీర్చమని అడగడంతో ఆ నేత ఆయనను దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 24 Jun 2020, 4:13 pm
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కడప జిల్లా ఎర్రగుంట్ల మర్డర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంటక రమణయ్య ఎర్రగుంట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంట్లో శవమై తేలాడు. అతని మొండెం మాత్రమే ముసలయ్య ఇంట్లోని సంపులో లభ్యమైంది. అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకే వెంకట రమణయ్యను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
Samayam Telugu shocking facts reveals in yerraguntla murder case
ఇంట్లో మొండెం.. తల స్టీల్ క్యాన్‌లో పెట్టి.. ఎర్రగుంట్ల మర్డర్ కేసులో సంచలన నిజాలు


ఇంటి నుంచి వెళ్లిన తండ్రి తిరిగి రాకపోవడంతో రమణయ్య కూతురు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముసలయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. సంపులో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులు గాలించగా రమణయ్య మొండెం బయటపడింది. ఆయన తల కనిపించలేదు. ముసలయ్య, ఆయన అనుచరులు రమణయ్యని దారుణంగా హత్య చేసి తలని మాయం చేసినట్లు గుర్తించిన పోలీసులు మున్సిపల్ మాజీ చైర్మన్‌ ముసలయ్యని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

​రాయచోటి ఘాట్‌లో తల..

రమణయ్య తలను రాయచోటి ఘాట్ రోడ్డులో పడేశానని.. తనను తీసుకెళ్తే చూపిస్తానని చెప్పడంతో పోలీసులు నిందితుడిని వెంటబెట్టుకెళ్లినట్లు తెలుస్తోంది. రాయచోటి ఘాట్ రోడ్డు నుంచి లోయలో పడేసిన రమణయ్య తలని గుర్తించారు. రమణయ్య తల ఉంచి లోయలోకి విసిరేసిన స్టీల్ క్యాన్‌‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రమణయ్య తలను గుర్తించారు. తల వేరుచేస్తే రమణయ్య శవాన్ని గుర్తుపట్టలేరని తల, మొండెం వేరుచేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే రిటైర్డ్ ఉద్యోగి రమణయ్య పెద్దఎత్తున డబ్బులు వడ్డీలకు ఇస్తుంటాడని తెలుస్తోంది. ఎర్రగుంట్లలో చాలామందికి రమణయ్య అప్పులిచ్చినట్లు సమాచారం.


Also Read: చిత్తూరులో ఘోరం.. లారీ బోల్తా పడి నలుగురి దుర్మరణం

​పక్కా ప్లాన్‌తో మర్డర్..

మాజీ చైర్మన్ ముసలయ్యకి కూడా పెద్దమొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చాడని.. అవి తీర్చమంటూ ఒత్తిడి చేయడంతోనే ఆయనను అంతమొందించినట్లు అనుమానిస్తున్నారు. డబ్బులడిగేందుకు వచ్చిన రమణయ్యను పక్కా ప్లాన్ ప్రకారం అనుచరులతో కలసి కిరాతకంగా హత్య చేసి ఉంటాడని.. అనంతరం తల, మొండెం వేరుచేసి పడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ముసలయ్య కూడా ఆర్థికంగా స్థితిమంతుడే. కేవలం అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకే చంపేసి ఉంటాడా? లేక మరేమైనా బలమైన కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read Also: బెడ్రూమ్‌లో ప్రియుడితో రెచ్చిపోయిన యువతి.. ఏకాంతంగా దొరికిపోవడంతో..

​పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు..

అప్పు ఇచ్చిన వెంకట రమణయ్య కూడా ఆర్థికంగా బలవంతుడేనని.. ఆయన పిల్లలు డాక్టర్లుగా స్థిరపడినట్లు తెలుస్తోంది. పెద్దమొత్తంలో డబ్బులు వడ్డీలకు ఇస్తుంటాడని.. ఆర్థిక వ్యవహారాల కారణంగానే ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎర్రగుంట్లలో చాలా మందికి ఆయన అప్పులిచ్చినట్లు తెలుస్తోంది. కనిపించకుండా పోయిన రోజు మాజీ చైర్మన్ ముసలయ్య ఇంటికి వెళ్తున్నట్లు రమణయ్య కుమార్తెకు తెలుసని.. తండ్రి తిరిగిరాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టడంతో ఘోరం వెలుగుచూసింది. ముసలయ్యతో సహా ఆయన ప్రధాన అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.


Also Read: బల్లకింద బుక్కైన ఆర్‌ఐ.. అనంతపురంలో ఏసీబీ దాడులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.