యాప్నగరం

వామ్మో వాలంటీర్!! షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఖాకీలు

వృద్ధులకు పంపిణీ చేయాల్సిన పింఛన్ డబ్బులు దోపిడీ దొంగలు దోచుకెళ్లారని.. కళ్లలో కారంకొట్టి దోచుకున్నారని వాలంటీర్ చెప్పాడు. తీరా పోలీసులు రంగంలోకి దిగడంతో..

Samayam Telugu 1 Oct 2020, 4:39 pm
అనంతపురం జిల్లాలో వాలంటీర్ కళ్లలో కారంకొట్టి పింఛన్ల డబ్బులు దోచుకెళ్లిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. అసలు వాలంటీర్‌పై దాడి జరగలేదని తేల్చారు. కళ్లలో కారం కొట్టనే లేదని.. అదంతా కనికట్టుగా తేల్చేశారు. దోపిడీ పేరుతో వాలంటీర్ ఆడిన హైడ్రామాకు తెరదించారు. మడకశిర పట్టణంలోని శివపుర ఏరియాకి చెందిన వాలంటీర్ వీరప్ప.. ఉదయం వృద్ధులకు పంపిణీ చేసేందుకు పింఛన్ల సొమ్ము తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు చెప్పాడు. కళ్లలో కారంకొట్టి సుమారు రూ.43,500 దోచుకెళ్లారంటూ ఆస్పత్రిలో చేరాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
robbery case


అయితే పోలీసుల ఎంట్రీతో వాలంటీర్ డ్రామా బట్టబయలైంది. అతనిపై దాడి జరగనే లేదని.. ఆ డబ్బులు తన సొంతానికి వాడుకుని దోపిడీ నాటకాన్ని రక్తికట్టించాడని తేల్చారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై డబ్బును రికవరీ చేసి సజావుగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వామ్మో వాలంటీర్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read: Anantapur: వాలంటీర్ కళ్లలో కారం కొట్టి.. పింఛన్ల డబ్బులు దోపిడీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.