యాప్నగరం

భూమి సర్వేకి వెళ్లిన తహసీల్దార్ దారుణహత్య.. సీఎం దిగ్భ్రాంతి

కామసముద్రం వద్ద కలవంచి గ్రామంలో భూమిని సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దార్ చంద్రమౌళీశ్వర దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 10 Jul 2020, 1:14 pm
ఇద్దరు వ్యక్తుల మధ్య కొనసాగుతున్న భూవివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన తహసీల్దార్ దారుణ హత్యకు గురైన ఘటన చిత్తూరు జిల్లా సరిహద్దు కర్ణాటకలోని కోలారు జిల్లా బంగారుపేట సమీపంలో జరిగింది. కామసముద్రం వద్ద కలవంచి గ్రామంలో భూమిని సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దార్ చంద్రమౌళీశ్వరపై రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటాచలపతి కత్తితో దాడి చేశారు. గ్రామానికి చెందిన వెంకటాచలపతి, రామమూర్తి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతోంది. దీన్ని పరిష్కరించేందుకు తహసీల్దార్ చంద్రమౌళీశ్వర గురువారం గ్రామానికి వెళ్లి భూమిని సర్వే చేశారు.
Samayam Telugu ఆస్పత్రిలో తహసీల్దార్


Also Read: బాలికను గర్భవతిని చేసిన మేనమామ.. వికారాబాద్‌ జిల్లాలో దారుణం

భూమిని కొలుస్తున్న సమయంలో వెంకటాచలపతి కత్తితో తహసీల్దార్ గుండెల్లో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ని స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కలవంచి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తహసీల్దార్ హత్యపై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

Also Read: రైల్వేలో ఉద్యోగం పేరుతో బ్యూటీషియన్‌కు టోకరా.. రూ.25లక్షలు నొక్కేసి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.