యాప్నగరం

Tamilnadu: ఈ దొంగ మహిళల లోదుస్తులు మాత్రమే ఎత్తుకెళ్తాడు

కోవైలో ఓ యువకుడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. రాత్రివేళ మహిళల లోదుస్తులు, చెప్పుడు, కాస్మోటిక్స్ ఎత్తుకెళ్తున్నాడు. ఈ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు షాకవుతున్నారు.

Samayam Telugu 23 Jan 2020, 9:30 am
తమిళనాడులోని కోవైలో ఓ యువకుడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇంటి బయట ఆరేసిన మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్తూ వాటిని దహనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తుడియలూరు మీనాక్షి గార్డెన్ ప్రాంతంలో 245 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ కొద్దిరోజులుగా ఉతికి ఆరేసిన మహిళల లోదుస్తులు, చెప్పులు, కారులో పెట్టిన కాస్మోటిక్స్ కనిపించకుండా పోతున్నాయి.
Samayam Telugu pjimage (3)


Also Read: విజయవాడలో ఇద్దరు ఆటోడ్రైవర్ల ఆత్మహత్య

వరుస ఘటనలతో ఆందోళన చెందిన స్థానికులు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రాత్రివేళ కాళ్లకు పట్టీలు ధరించి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అతను చోరీ చేసి తీసుకెళ్లిన లోదుస్తులను అదే ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద దాచడం, వాటిలో కొన్నింటిని అక్కడే నిప్పంటించి దహనం చేసినట్లు గుర్తించారు.

Also Read: ఒంగోలులో మహిళపై గ్యాంగ్ రేప్?.. రోడ్డుపక్కన నగ్నంగా బాధితురాలు

అతడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలీక స్థానికులు ఆందోళ చెందుతున్నారు. అతడి ప్రవర్తన మరింత ముదిరి మహిళలపై ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడతాడా? అని భయపడుతున్నారు. ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పచ్చని సంసారాన్ని చిదిమేసిన విధి.. భర్త, కుమార్తె మృతితో అనాథగా మారిన మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.