యాప్నగరం

షాకింగ్.. తెలంగాణ హాస్టల్‌లో గర్భం దాల్చిన నలుగురు డిగ్రీ విద్యార్థినులు

ఆసిఫాబాద్ జిల్లాలో హాస్టల్‌లో ఉంటున్న నలుగురు డిగ్రీ విద్యార్థినులు గర్భం దాల్చారు. దీంతో ఈ ఘటనపై ఆర్‌సీఓ లక్ష్మయ్య హాస్టల్ నిర్వాహకుల సమక్షంలో విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Samayam Telugu 28 Dec 2019, 1:01 pm
తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లాలో హాస్టల్‌లో ఉంటున్న నలుగురు డిగ్రీ విద్యార్థినులు గర్భం దాల్చడం సంచలనం రేపుతోంది. ట్రైబల్ హస్టల్‌లో ఉంటూ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థినులు గర్భం దాల్చారు. దీంతో హస్టల్ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా 10 మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం కాకపోవడంతో అనుమానం వచ్చి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
Samayam Telugu file.


Also Read: పూజారి బరితెగింపు.. మైనర్ బాలికపై అత్యాచారం

దీంతో ముగ్గురు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. అలాగే మరో విద్యార్థిని మూడు నెలల గర్భవతిగా తేల్చారు. అయితే ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఉంచింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థినులు గర్భం దాల్చిన విషయం వాస్తవమేనని ప్రిన్సిపాల్ నిర్ధారించారు.

దీంతో ఈ ఘటనపై శనివారం ఆర్‌సీఓ లక్ష్మయ్య బాధిత విద్యార్థినులతో పాటు ఏఎన్‌ఎం, ప్రిన్సిపాల్‌, జిల్లా గిరిజన అధికారుల సమక్షంలో విద్యార్థినుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితమే వసతి గృహంలో ఓ విద్యార్థిని గర్భం దాల్చినట్లు స్థానిక వైద్య సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నలుగురు విద్యార్థినులు గర్భవతులుగా తేలడం సంచలనం రేపింది.

Also Read: ఆశ్రయమిచ్చిన యజమాని తొమ్మిదేళ్ల కూతురిపై రేప్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.