యాప్నగరం

దొంగతనానికి వెళ్లి యువతిపై రేప్.. ఢిల్లీలో కీచక దొంగ

ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగ ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పకపోవడంతోనే ఆమెపై అఘాయిత్యం చేశాడు.

Samayam Telugu 25 May 2020, 5:10 pm
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ ఆ కుటుంబంలోని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీ నగరంలోని ఓ ప్రాంతంలో నివసించే యువతి శనివారం ఇంటి బాల్కనీలో కూర్చొని మొబైల్ చూస్తోంది. ఆ సమయంలో కుటుంబసభ్యులందరూ బయటికి వెళ్లడంతో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఓ యువకుడు ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను బెదిరించి నగదు, విలువైన వస్తువులు దోచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె పర్సులో ఉన్న ఏటీఎం కార్డు కూడా తీసుకున్నాడు.
Samayam Telugu Image


Also Read: మహిళలపై ప్రేమ వల.. ఆపై కోరికలు తీర్చుకుని బ్లాక్‌మెయిల్.. నెల్లూరు కీచకుడి అరెస్ట్

ఆ కార్డ్ పిన్ చెప్పాలని అతడు కోరగా యువతి నిరాకరించింది. ఎన్నిసార్లు ఆమె పిన్ చెప్పకపోవడంతో ఆగ్రహించిన ఆ దొంగ ఆమెను మంచానికి కట్టేసి దారుణంగా అత్యాచారం చేసి పరాయ్యాడు. కాసేపటి తర్వాత తేరుకున్న యువతి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ దొంగ తనపై అత్యాచారం చేయడమే కాకుండా.. గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో పోలీసులు ఆ దొంగను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: కోడికత్తితో ప్రియుడి గొంతు కోసిన యువతి అన్న.. వీడిన చీరాల మర్డర్ మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.