యాప్నగరం

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రి నుంచి ఇంటికెళ్తున్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

Samayam Telugu 26 Jan 2020, 7:19 am
డ్రైవర్ నిద్రమత్తు ముగ్గురిని బలితీసుకుంది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అంబులెన్స్ ఢీకొన్న వేగానికి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రపోయి వాహనంపై అదుపుకోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu accident


నెల్లూరు నుంచి బిట్రగుంట వెళ్తున్న అంబులెన్స్ కొడవలూరు మండల పరిధిలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి బయల్దేరిన అంబులెన్స్ ఇస్కో కిసాన్ సెజ్ వద్దకు రాగానే డివైడర్‌ని ఢీకొట్టి గాల్లోకి ఎగిరి రహదారి పక్కన పడిపోయింది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలై దుర్మరణం చెందారు.

Also Read: మొగుడ్ని చంపించింది.. ప్రియుడిని బుక్ చేసింది.. కీలాడీ లేడీ ప్లాన్‌కి హైదరాబాద్ పోలీసులు షాక్

ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన డ్రైవర్ వినయ్(21), విక్టర్(65), తిలోమణి(80) మృతి చెందినట్లుగా గుర్తించారు. పొడుగుపాడు వీవోఏ పుష్పకు గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది పుష్పను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కాపురంలో చిచ్చుపెట్టిన బైక్.. పిల్లలతో సహా కాల్వలో దూకిన భార్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.