యాప్నగరం

నీటి కుంటలో తేలిన టైరు.. అనుమానంతో వెతికిన కుటుంబ సభ్యులకు షాక్.. ముగ్గురు చిన్నారులు.!

సరదాగా ఆడుకుంటున్న చిన్నారులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అప్పటి వరకూ ఇక్కడే నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలు ఏమైపోయారో ఆ తల్లిదండ్రులకు అర్థంకాలేదు. ఎంతసేపు వేచి చూసినా పిల్లల జాడ తెలియకపోవడంతో ఊరంతా వెతకడం ప్రారంభించారు. తెలిసిన వారిని ఆరా తీశారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

Samayam Telugu 20 Jan 2020, 5:45 pm
సరదాగా ఆడుకుంటున్న చిన్నారులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అప్పటి వరకూ ఇక్కడే నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలు ఏమైపోయారో ఆ తల్లిదండ్రులకు అర్థంకాలేదు. ఎంతసేపు వేచి చూసినా పిల్లల జాడ తెలియకపోవడంతో ఊరంతా వెతకడం ప్రారంభించారు. తెలిసిన వారిని ఆరా తీశారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
Samayam Telugu three kids died in water pond in nizamabad district
నీటి కుంటలో తేలిన టైరు.. అనుమానంతో వెతికిన కుటుంబ సభ్యులకు షాక్.. ముగ్గురు చిన్నారులు.!


​నీటికుంటలో తేలియాడుతున్న టైరు..

మరుసటి రోజు తెల్లవారుజామున ఊరికి సమీపంలోని నీటికుంటలో కనిపించిన ఓ టైరు కొత్త అనుమానాలు రేపింది. ఎలాంటి అశుభం జరగకూడదని వేడుకుంటూనే నీటి కుంటలో దిగి వెతకడం ప్రారంభించారు. కానీ ఆ తల్లిదండ్రులపై విధి కనికరం చూపలేదు. ముగ్గురు చిన్నారులు నీటికుంటలోనే విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రుల గుండె బద్దలైంది. కళ్లు కన్నీటి ధారలయ్యాయి. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ముగ్గురు చిన్నారుల దుర్మరణం

నిజామాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. రెంజల్ మండలంలోని నీలా పంచాయతీ పరిధిలోని పేపర్ మిల్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న దీపక్, సిద్దార్థ, హుజూర్ సరదాగా ఆడుకుంటూ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు.

Also Read: జైలులో భర్త.. ఒంటరిగా ఉన్న భార్యపై పక్కింటివారి పైశాచికత్వం

కుంటలో వెతుకులాట..

పిల్లలు కనిపించపోవడంతో గాబరా పడ్డ తల్లిదండ్రులు అర్థరాత్రి వరకు గ్రామం నలువైపులా వెతికారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం గ్రామంలోని నీటికుంటలో ఓ టైర్ తేలియాడుతుండడం గమనించిన గ్రామస్థులు అనుమానించారు. ఒకవేళ కుంటలో పడిపోయి ఉండొచ్చని భావించి వెతకడం ప్రారంభించారు.

Read Also: గుంటూరు జిల్లాలో దారుణం.. పదకొండేళ్ల బాలికపై అత్యాచారం..

కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు

కుంటలో వెతుకులాట ప్రారంభించిన కుటుంబ సభ్యులకు తమ పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో ఒక్కసారిగా గుండె బద్దలైంది. నీటికుంటలో నుంచి దీపక్, సిద్దార్థ, హుజూర్ మృతదేహాలను వెలికితీశారు. ఆడుకుంటుండగా టైర్ నీటికుంటలో పడిపోవడంతో తీసేందుకు దిగి ప్రమాదవశాత్తూ ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు భావిస్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.